మెగాస్టార్ చిరంజీవి సినిమా థియేటర్లలో విడుదలవుతుందంటే తొలిరోజు టికెట్లు దొరకడం సులువు కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సినిమాల ద్వారా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన వాళ్లలో చిరంజీవి ఒకరు. చిరంజీవి రీఎంట్రీలో నటించిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే ఆచార్య సినిమాకు బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.
ఈ సినిమాకు బుకింగ్స్ ఈ విధంగా ఉండటానికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ ఎంచుకుని మేకర్స్ తప్పు చేశారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత విడుదల కావడం మరో విధంగా మైనస్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి.
విద్యార్థుల పరీక్షలు కూడా కొంతమేర ఈ సినిమా బుకింగ్స్ పై ప్రభావం చూపుతున్నాయి. మౌత్ టాక్, రివ్యూలను బట్టి ఈ సినిమా పుంజుకుంటుందో లేదో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అఖండ, పుష్ప ది రైజ్, భీమ్లా నాయక్ సినిమాలకు ఫస్ట్ డే బుకింగ్స్ ఉన్న స్థాయిలో కూడా ఆచార్య సినిమాకు బుకింగ్స్ లేకపోవడం గమనార్హం. ఆచార్య ఫస్ట్ డే కలెక్షన్లు 30 కోట్ల రూపాయల లోపు ఉండే ఛాన్స్ అయితే ఉంది.
టికెట్ రేట్ల పెంపు ఆచార్య సినిమాకు మైనస్ అయిందే తప్ప ప్లస్ కాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు పలు నెగిటివ్ సెంటిమెంట్లు ఈ సినిమా మేకర్స్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఆచార్య ఈ సెంటిమెంట్లను బ్రేక్ చేసి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన సినిమాకు బుకింగ్స్ ఈ విధంగా ఉండటం మెగా అభిమానులను సైతం కలవరపెడుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించిన ఆచార్య సినిమా టికెట్ బుకింగ్స్ ఈ విధంగా ఉండటంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.