‘జబర్దస్త్’ అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఓ పక్క బుల్లితెర పై యాంకర్ గా రాణిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా ప్రాముఖ్యమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’లో మంగళం శీను (సునీల్) భార్య దాక్షాయణి గా ఓ లేడీ విలన్ పాత్రలో అద్భుతంగా నటించి దేశం మొత్తం పాపులర్ అయ్యింది.
ఇక రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడీ’ సినిమాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తూ హీరోయిన్లను సైతం డామినేట్ చేసింది. ఇక సునీల్ తో ‘దర్జా’, ‘వాంటెడ్ పండుగాడ్’, చిరు తో గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో నటిస్తూ అనసూయ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈమెకు స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.
అలాగే ట్రోలింగ్ తో వార్తల్లో కూడా నిలుస్తుంటుంది. ఇదిలా ఉండగా… తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలకి గాను ఆమె పై ట్రోలింగ్ జరుగుతుంది.ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలను గనుక గమనిస్తే.. అనసూయ ఫేస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. దీంతో ‘ముసలి దానిలా ఉన్నావ్’, ‘ముఖంలో గ్లో పోయింది’, ‘మేకప్ వేసుకోవడం మర్చిపోయావా?’, ‘ఇప్పుడు ఏజ్ బయటపడుతుంది’, ‘ముడతలు ఎక్కువగానే ఉన్నాయి’,అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి వీటి పై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..!