జూన్ 10 న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో అభిమానులు ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆ వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ హడావుడి కనిపిస్తుంది కూడా.! అయితే.. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో అలాంటి వేడుకలు నిర్వహించొద్దు అని బాలయ్య తన సోషల్ మీడియా ద్వారా వేడుకున్నాడు. తన ఫేస్ బుక్ పేజీ ద్వారా బాలయ్య మాట్లాడుతూ.. “నా ప్రాణ సమానులైన అభిమానులకు ..ప్రతి ఏటా జూన్ 10 వతేదీ నా పుట్టిన రోజునాడు ..నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని ..
కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు ..నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానం..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను ..మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు.. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు.. మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక ..దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ ..ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ ..మీ నందమూరి బాలకృష్ణ ..” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు బాలయ్య.
అయితే ఈ కామెంట్స్ పై ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ‘ఒక్క అభిమాని దూరమైనా తట్టుకోలేడట.. కానీ ఎదురుగా ఉంటే మాత్రం చెంపలు వాయిస్తాడు’, ‘నీ దగ్గరకు రాకపోవడమే మంచిది లే.. మనుషులను చూడకుండా తరిమి తరిమి కొడతావు’ ‘హమ్మయ్య ఫ్యాన్స్ కు దెబ్బలు తప్పాయి’ అంటూ విమర్శిస్తున్నారు. గతంలో బాలయ్య చాలా మంది అభిమానులను పబ్లిక్ గా కొట్టడం.. మళ్ళీ వాటిని అభిమానులు సమర్ధించడం వంటివి మనం చూస్తూనే వచ్చాము. అందుకే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని స్పష్టమవుతుంది.