‘బాహుబలి'(బాహుబలి ది బిగినింగ్) తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ‘బాహుబలి 2 ‘ ‘సాహో’ చిత్రాలు అతని ఇమేజ్ ను ఇంకా పెంచాయి. అదే టైంలో బాహుబలి లో ప్రభాస్ గెటప్ ని మైనపు బొమ్మలా చేయబోతున్నట్టు మేడం టుస్సాడ్స్ వాళ్ళు ప్రకటించారు. అటు తర్వాత మైసూర్ మ్యూజియంలో కూడా ప్రభాస్ వ్యాక్స్ స్టాట్యూ పెట్టబోతున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేశారు.
కర్ణాటకలో కూడా ప్రభాస్ క్రేజ్ పీక్స్ లో ఉంది. అతని సినిమాలు అక్కడ భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. అయితే మైసూర్ లో ఏర్పాటు చేసిన ప్రభాస్ మైనపు విగ్రహం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇంకా చెప్పాలంటే ట్రోలింగ్ స్టఫ్ గా మారిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ టాపిక్ చర్చనీయాంశం అయ్యిందని చెప్పాలి. నిజంగా ఈ విగ్రహం ప్రభాస్ దే అని చెప్పుకోవడానికి కష్టంగానే అనిపిస్తుంది. అసలు ప్రభాస్ కి ఈ విగ్రహానికి అస్సలు సంబంధం లేదు.
అందుకే ‘ఎవడ్రా ఇది చేసింది?’ ‘ఇది ప్రభాస్ విగ్రహమేంటి?’ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున రచ్చకి దిగారు. సెప్టెంబర్ 28 న విడుదల కావాల్సిన ‘సలార్’ పోస్ట్ పోన్ అయ్యింది అంటూ అభిమానులు బాధపడుతున్న టైంలో ఈ మైనపు బొమ్మ వారికి మరో తలనొప్పిగా మారింది అని చెప్పొచ్చు. ‘సలార్’ తర్వాత ప్రభాస్.. ‘ప్రాజెక్ట్ కె ‘ అదే ‘కల్కి 2898 ‘ లో నటిస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఓ సినిమా ఓకే చేశాడు.