ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబోలో తెరకెక్కుతున్న దేవర (Devara) సినిమా రిలీజ్ కావడానికి మరో 18 రోజుల సమయం ఉంది. దేవర ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం మరింత పెంచనున్నారని హిందీ మార్కెట్ లో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించేలా మేకర్స్ ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది. ముంబైలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుండటం కరణ్ జోహార్ ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తుండటంతో అక్కడ కూడా అంచనాలు పెరుగుతున్నాయి.
అయితే దేవర (Devara) సినిమా రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సాధారణంగా దేవర హిందీ వెర్షన్ అక్కడి ప్రముఖ మల్టీప్లెక్స్ లలో విడుదల కావాలంటే ఓటీటీలో ఎనిమిది వారాల తర్వాత మాత్రమే సినిమా స్ట్రీమింగ్ కావాల్సి ఉంటుంది. దేవర విషయంలో సైతం ఈ నిబంధన అమలయ్యే ఛాన్స్ ఉంది. కల్కి (Kalki 2898 AD) మూవీ సైతం రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది.
దేవర (Devara) విషయంలో సైతం అవే నిబంధనలు అమలయ్యే ఛాన్స్ ఉంది. దేవర సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 150 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. దేవర సినిమా నిడివి గంటల 50 నిమిషాలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. దేవర సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జాన్వీ ఇమేజ్ దేవర సినిమాతో మారిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. దేవర సినిమా 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ స్క్రీన్ పై కనిపించే ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.