మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగి 12 రోజులైంది. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారిలో విష్ణు విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకాష్ రాజ్ తరచూ విష్ణుపై విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వైసీపీ జోక్యం ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. సాంబ శివరావు అనే వ్యక్తి జగన్, మోహన్ బాబు, విష్ణుతో కలిసి దిగిన ఫోటోలను ఎన్నికల కేంద్రం దగ్గర దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సాంబ శివరావు ఓటర్లను బెదిరించి ఓటు వేయించుకున్నారని అతనిని పోలింగ్ కేంద్రంలోకి ఏ విధంగా అనుమతించారని ప్రశ్నించారు. ఎన్నికల కేంద్రంలో ఏం జరిగిందో ప్రపంచానికి తెలియాలంటూ ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల గురించి విష్ణు వివరణ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు వ్యక్తమైన వెంటనే విష్ణు స్పందించి వివరణ ఇవ్వకపోతే కొంతమంది నిజంగానే ఎన్నికల విషయంలో ఏదో జరిగిందని అభిప్రాయపడే ఛాన్స్ ఉంది.
మరోవైపు ప్రకాష్ రాజ్ రాబోయే రోజుల్లో మరిన్ని ఫోటోలు, వీడియోలను రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదాల వల్ల ప్రజల్లో ఇండస్ట్రీకి చెందిన వారి గురించి చులకన భావం ఏర్పడుతోంది. ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మహిళలకే పెద్దపీట వేసినట్టు విష్ణు కీలక ప్రకటన చేశారు.