ఈ ఏడాది చిన్న సినిమాలలో పెద్ద హిట్ ఏదనే ప్రశ్నకు ఎలాంటి సందేహం అవసరం లేకుండా హనుమాన్ (Hanu Man) పేరు సమాధానంగా చెప్పవచ్చు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి రిఫరెన్స్ తో తీసిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆంజనేయ స్వామి భక్తుడు అనే సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమాలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం కొసమెరుపు.
విశ్వంభర సినిమా కొరకు 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సెట్ లో ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హనుమంతునికి సంబంధించిన ఒక పాట ఉంటుందని ఆ పాట సినిమాలో ఎంతో స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. విశ్వంభర సినిమాలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.
2024 సంక్రాంతి కానుకగా హనుమాన్ మూవీ ప్రేక్షకులను మెప్పించగా 2025లో హనుమంతుని రిఫరెన్స్ లతో తెరకెక్కుతున్న విశ్వంభర బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నుంచి సమాచారం అందుతోంది. సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని సమాచారం అందుతోంది. అషికా రంగనాథ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని భోగట్టా.
విశ్వంభర ఒక పార్ట్ మూవీగానే తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. విశ్వంభర నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. విశ్వంభర సినిమా చిరంజీవికి మెమొరబుల్ సినిమాగా నిలవనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.