Shraddha Das, Anasuya: అనసూయ కి సపోర్ట్ చేసినందుకు శ్రద్ధాదాస్ పై ట్రోలింగ్..!

‘లైగర్’ సినిమా రిలీజ్ అయిన రోజు నుండి అనసూయ ట్రెండింగ్లోనే ఉంది. 5 ఏళ్ళ క్రితం ‘అర్జున్ రెడ్డి’ వివాదాన్ని తీసుకొచ్చి ‘లైగర్’ ప్లాప్ అయినందుకు ఆమె సంతోషిస్తున్నట్టు ఓ ట్వీట్ వేసింది. ఆమె ఇండస్ట్రీలో ఉండి.. క్రేజ్ ఉన్న నటి అయ్యి ఉండి.. ఓ సినిమా ప్లాప్ అయితే సంతోషించడం అనే పాయింట్ చాలా వ్యతిరేకంగానే ఉంది. అయితే విజయ్ అభిమానులు దీనిని పర్సనల్ గా తీసుకుని అనసూయ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

వాళ్లకు సపోర్ట్ గా చాలా మంది నెటిజన్లు మద్దతుగా నిలుస్తూ అనసూయ పై ఫైర్ అవుతున్నారు. ఆమె మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ క్రమంలో ఓ నెటిజెన్ ‘ఆంటీ’…. అంటే ‘నన్ను ఆంటీ అంటే కేసు వేస్తా’ అంటూ అనసూయ మండిపడుతుంది. అందరి ట్వీట్లు షేర్ చేసుకుని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు కూడా ఆమె హెచ్చరించింది. నిన్న మొత్తం ఆంటీ అనే పదం ట్రెండింగ్లో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయకు మద్దతు పలుకుతూ.. శ్రద్దా దాస్ ఓ ట్వీట్ వేసింది. దీంతో ఆమె పై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. శ్రద్ధాదాస్ అనసూయ పై ట్వీట్ వేస్తూ.. “మీ వయసులో సగం వయసున్న అమ్మాయిల కంటే, మీ కంటే పెద్ద వయసున్న అంకుల్స్‌ కంటే మీరే అందంగా ఉన్నారు” అంటూ పేర్కొంది. ఇందుకు నెటిజన్లు శ్రద్దా దాస్ ను కూడా ఆడేసుకుంటున్నారు. ఈ ట్రోల్స్ కు రియాక్ట్ అయిన ఆమె..

“అనవసరంగా నన్ను దూషిస్తూ మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటున్నారు. నేను మాత్రం సింపుల్ గా బ్లాక్ చేసి డిలీట్ చేస్తా. ఇదసలు పాయింటే కాదు. అనసూయ లుక్స్‌ గురించి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు నన్ను ట్రోల్‌ చేయడంలో ఏమాత్రం అర్ధం లేదు” అంటూ శ్రద్దాదాస్ బదులిచ్చింది. ‘ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి అని భావించి అనసూయ.. శ్రద్ధాదాస్ కు ఫోన్ చేసి.. ఆమెతో ట్వీట్ వేయించుకుని ఉంటుంది. ఎలాగు శ్రద్ధ దాస్ కూడా బుల్లితెర పై కనిపిస్తుంది కదా’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతుండడం హాట్ టాపిక్ అయ్యింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus