వెండి తెరపై అయినా బుల్లితెరపై అయినా ఒక సినిమా ప్రసారానికి ముందు ధూమపానానికి సంబంధించిన ఒక యాడ్ వచ్చే సంగతి మనకు తెలిసిందే. ఈ నగరానికి ఏమైంది ఒకవైపు నుంచి మరోవైపు పొగ అంటూ వచ్చే ఈ యాడ్ లో అమాయకపు చూపులు చూస్తూ తండ్రి పక్కన కూర్చున్నటువంటి చిన్నారిని మాత్రం ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. ఇలా అమాయకపు చూపులతో ఈ యాడ్ లో కనిపించిన ఈ చిన్నారి ప్రస్తుతం హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఈ యాడ్ లో చేసిన ఈ చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్. ఈ యాడ్ ఎంతో ఫేమస్ కావడంతో ఈమె తరువాత సుమారు 150 యాడ్స్ చేసి పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిమ్రాన్ నటేకర్ ప్రస్తుతం హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికే సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ నిర్మాణ సంస్థ చేపట్టినటువంటి ఆడిషన్స్ లో ఈమె సెలెక్ట్ అయిందని తెలుస్తోంది.
ఇలా సిమ్రాన్ నటేకర్ (Simran Natekar) ఒక టాలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారన్న వార్త వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఈమె లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం కోసం తరచూ ఫోటో షూట్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సిమ్రాన్ నటేకర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
1997లో సిమ్రాన్ నటేకర్ ముంబైలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. అయితే త్వరలోనే హీరోయిన్ గా కూడా ప్రేక్షకులను సందడి చేయాడానికి సిద్ధమవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన వారందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సిమ్రాన్ నటేకర్ త్వరలోనే హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.