టాలీవుడ్‌లో ప్రతీ పెద్ద నిర్మాణ సంస్థకు ఒక స్పెషల్ డైరెక్టర్ ఉంటాడు. ఆ నిర్మాణ సంస్థను లాభాల్లో నిలబెట్టే విధంగా కమర్షియల్ సినిమాలు అందించగల దర్శకుడు, నిర్మాతలకు బాగా నచ్చేస్తాడు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) -దిల్ రాజు (Dil Raju) కాంబో అలానే ఇండస్ట్రీలో నిలిచిపోయింది. వరుస హిట్‌లతో అనిల్ రావిపూడిని తన బ్యానర్‌కి కట్టిపడేసిన దిల్ రాజు, సూపర్ హిట్ సినిమాలతో భారీ లాభాలు కూడా అందుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్‌ను (Kalyan Shankar) సితార ఎంటర్టైన్మెంట్స్ పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, కళ్యాణ్ శంకర్ బోల్డ్‌గా ముందుకు వచ్చి మ్యాడ్ సినిమాను తీసాడు. చిన్న సినిమాగా వచ్చిన మ్యాడ్ పెద్ద రేంజ్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. దీంతో నిర్మాత నాగ వంశీ (Suryadevara Naga Vamsi) ఈ యువ దర్శకుడిపై మరింత నమ్మకం పెంచుకున్నాడు. వెంటనే మ్యాడ్ స్క్వేర్ (Mad Square) ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి, షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుండగా, మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా నాగ వంశీ తన చేతుల్లో పెట్టేశాడు.
అదే టిల్లు క్యూబ్. సిద్ధు జొన్నలగడ్డ క్రియేటివ్ ఎనర్జీతో నడిచే ఈ ఫ్రాంచైజీకి కళ్యాణ్ శంకర్‌ను డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. DJ టిల్లు (DJ Tillu), టిల్లు స్క్వేర్ (Tillu Square) భారీ విజయాల తర్వాత, ఇప్పుడు టిల్లు క్యూబ్ మరింత పెద్ద లెవెల్‌లో రూపొందనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో టీం ఉంది. టిల్లు క్యూబ్ కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించారని, ప్రీ ప్రొడక్షన్ దశలోనే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నట్లు సమాచారం. కామెడీ ఎంటర్‌టైనర్‌లలో తన ప్రత్యేకతను ఇప్పటికే మ్యాడ్ తో నిరూపించుకున్న కళ్యాణ్ శంకర్, ఇప్పుడు టిల్లు క్యూబ్కి డైరెక్టర్‌గా మరింత క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

DJ టిల్లు నుంచి మొదలైన ఈ ఫ్రాంచైజీ, రెండో పార్ట్‌లో సక్సెస్ అందుకుంది. అయితే మూడో భాగానికి మరింత పక్కాగా స్క్రిప్ట్ కావాలి. అందుకే సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), కళ్యాణ్ శంకర్ కలిసి స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారని టాక్. మొత్తానికి ఒకవైపు మ్యాడ్ స్క్వేర్ మరొకవైపు టిల్లు క్యూబ్, ఇలా బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్ సినిమాలు అందించే డైరెక్టర్‌గా కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) నిలిచే అవకాశం ఉంది. దిల్ రాజు – అనిల్ రావిపూడి కాంబో తరహాలో, ఇప్పుడు నాగ వంశీ – కళ్యాణ్ శంకర్ కాంబో టాలీవుడ్‌లో సూపర్ హిట్ బ్రాండ్‌గా మారుతుందా? అనేది వేచి చూడాలి.
