రాంచరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. శంకర్ (Shankar) డైరెక్ట్ చేసిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రానికి నిర్మాత. ఆయన కెరీర్లో 50వ సినిమాగా ‘గేమ్ ఛేంజర్’ రూపొందింది. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అంజలి (Anjali) , ఎస్.జె.సూర్య (SJ Suryah) , శ్రీకాంత్ (Srikanth) , నవీన్ చంద్ర (Naveen Chandra), జయరాం (Jayaram) వంటి స్టార్స్ నటించారు. ఇక తాజాగా ‘గేమ్ ఛేంజర్’ గురించి నటుడు ఎస్.జె.సూర్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
SJ Suryah
ఎస్.జె.సూర్య (SJ Suryah) తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ” హాయ్ ఫ్రెండ్స్..! ఇప్పుడే ‘గేమ్ ఛేంజర్’ సినిమా డబ్బింగ్ ఫినిష్ చేశాను. రాంచరణ్, శ్రీకాంత్..ల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఆ 2 సన్నివేశాలకి 3 రోజులు టైం పట్టింది. ఇక ఔట్పుట్ చూశాక.. ‘దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. థియేటర్స్ లో కొన్ని సీన్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడం గ్యారెంటీ.
‘పోతారు మొత్తం పోతారు’ థాంక్యూ శంకర్ సార్, దిల్ రాజు గారు అండ్ టీం.. నాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు. రాంపింగ్ సంక్రాంతికి కలుద్దాం” అంటూ రాసుకొచ్చాడు. ఇక ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి ఎస్.జె.సూర్య కూడా సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా వర్క్ చేసినట్టు మొన్నామధ్య కథనాలు వినిపించాయి.
అంతకు ముందు శైలేష్ కొలను (Sailesh Kolanu) సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు అతను నానితో (Nani) ‘హిట్ 3’ సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అందుకే ఎస్.జె.సూర్య సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.
Hi friends , I just finished dubbing of two vital scenes in #GAMECHANGER (one with our Global star @AlwaysRamCharan garu & another with Srikant garu … it took 3 whole days to finish these 2 scenes dubbing …. The out put came out like “ dheenamma dhimma thirigi bomma…