‘7/జి బృందావన కాలనీ’ హీరోయిన్ కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందా?

2002 లో వినీత్, అబ్బాస్ లు హీరోలుగా వచ్చిన ‘నీ ప్రేమకై’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సోనియా అగర్వాల్. ఆ తరువాత జగపతి బాబుతో ‘థమ్’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే 2004 లో వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘7/జి బృందావన కాలనీ’ తోనే ఈమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ చిత్రం దర్శకుడు అయిన సెల్వ రాఘవన్ నే ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2006 లో వీరి పెళ్లి జరిగింది.

కొన్నాళ్ళ పాటు బాగానే కలిసున్నారు.. అయితే తరువాత మనస్పర్ధలు రావడంతో 2010లో విడాకులు తీసుకున్నారట. అప్పటి నుండీ ఒంటరిగానే ఉంటూ వచ్చిన సోనియా.. మధ్యలో ఎన్టీఆర్.. ‘టెంపర్’, అలాగే సాయి తేజ్ ‘విన్నర్’ వంటి చిత్రాల్లో నటించింది. రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రెడ్’ సినిమాలో కూడా ఈమె ఓ కీలక పాత్ర పోషించిందని టాక్. ఇదిలా ఉండగా.. త్వరలో సోనియా రెండో పెళ్లి చేసుకోబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా సోనియా అగర్వాలే తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.

‘రెండు రోజుల్లో తన ఎంగేజ్మెంట్ అంటూ నిన్న ఓ చిన్న వీడియో ప్రోమోని పోస్ట్ చేసింది. అంటే జూలై 25 న ఈమె ఎంగేజ్మెంట్ జరుగబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె పెళ్లి టాపిక్ వైరల్ గా మారింది. ఇక సోనియా అగర్వాల్ వయసు 38 సంవత్సరాలు.

1

2

3

4

5

6

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Share.