కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఇళ్లల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయి. గత కొద్దిరోజుల క్రితం తన పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు నగలు దొంగతనం జరిగిన విషయం మనకు తెలిసిందే. వీటికి విలువ సుమారు 60 లక్షల వరకు ఉంటుందని ఈమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అసలు విషయం బయట పెట్టారు. ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పని చేసే పనిమనిషి ఈ దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు విచారణలో పేర్కొన్నారు.
ఐశ్వర్య రజనీకాంత్ తనతో పెద్ద ఎత్తున పని చేయించుకుని చాలీచాలని జీతం ఇస్తున్నారని అందుకే తాను ఈ పని చేశానంటూ స్వయంగా పనిమనిషి ఈశ్వరి ఒప్పుకున్న సంగతి తెలిసిందే అయితే ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో జరిగినటువంటి దొంగతనం మర్చిపోకముందే రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య ఇంట్లో దొంగతనం జరగడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఈమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సౌందర్య రజనీకాంత్ (Soundarya Rajinikanth) ఓ ప్రైవేట్ కళాశాలలో ఉన్నటువంటి ఈవెంట్ కోసం వెళ్లి రాగా వచ్చేలోపు తన ఇంట్లో ఉన్నటువంటి తన SUV కారు తాళాలు కనిపించలేదని చెన్నైలోని తేనాంపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించనున్నట్లు తెలియజేశారు..ఈ విధంగా కారు తాళాలు కనిపించకపోవడంతో సౌందర్య రజనీకాంత్ పోలీసులను ఆశ్రయించడంతో పలువురు ఈ విషయంపై విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇలా కొద్ది రోజుల వ్యవధిలోని రజనీకాంత్ ఇద్దరు కుమార్తెల ఇళ్లల్లో ఇలా దొంగతనాలు జరగడంతో ఇది యాదృచ్ఛికంగా జరిగినదా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఇలా ఈ కుటుంబాన్ని టార్గెట్ చేశారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.