సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పారితోషికం గత దశాబ్దంలో విపరీతంగా పెరిగింది. పదేళ్ల క్రితం హీరోలు రూ.10-20 కోట్లు తీసుకునే సమయంలో, హీరోయిన్లు కోటి రూపాయలు అందుకుంటేనే అది పెద్ద విషయంగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ నటీమణులతో సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. తెలుగు నటీమణుల్లో ఇద్దరు-ముగ్గురు రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నయన్ (Nayanthara) (Nayanthara)అయితే ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేస్తోందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
ఇటీవల మరో స్టార్ హీరోయిన్ (Heroines) తెలుగు సినిమా కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేసి, నిర్మాతల నుంచి ఒప్పందం కుదుర్చుకుంది. ఆమె పెద్దగా యాక్షన్ సీన్స్, నటనలో ఎక్కువ డెప్త్ ఉన్న పాత్రలు చేయకపోయినా, ఆమె మార్కెట్ విలువను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ఈ భారీ మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో నటించే సీనియర్ హీరోకు తెలుగు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, ఇతర భాషల్లో ఆ సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి ఆ హీరోయిన్ క్రేజ్‌ను వాడుకోవాలని భావించారు.
హీరోయిన్ల పారితోషికం పెరగడానికి ప్రధాన కారణం వారి స్టార్‌డమ్, ఇతర భాషల్లో సినిమాకు లభించే మార్కెట్. ఉదాహరణకు, బాలీవుడ్ నటీమణులు తెలుగు సినిమాల్లో నటిస్తే హిందీ మార్కెట్‌లో సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుంది. ఇటీవల ఓ యంగ్ హీరో సినిమా కోసం బాలీవుడ్ నటిని ఎంచుకుని, ఆమెకు భారీ పారితోషికం ఇచ్చారు. ఆమె స్టార్‌డమ్‌తో ఆ సినిమా హిందీలో మంచి ఆదరణ పొందింది. ఇటు సౌత్ నటీమణులు కూడా ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదిస్తున్నారు.
వారి క్రేజ్‌తో సినిమాకు థియేటర్ బిజినెస్‌తో పాటు ఓటీటీ రైట్స్ విలువ కూడా పెరుగుతోంది. ఉదాహరణకు, ఓ సీనియర్ హీరో సినిమాలో బాలీవుడ్ నటి ఐటెం సాంగ్ చేయడం వల్ల హిందీ ఓటీటీలో ఆ సినిమాకు రికార్డు వ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు హీరోయిన్లను ఎంచుకునేటప్పుడు వారి మార్కెట్ విలువను దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఈ ట్రెండ్‌తో భవిష్యత్తులో సౌత్ హీరోయిన్లు (Heroines) హీరోలతో సమానంగా పారితోషికం అందుకునే రోజు దూరంలో లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.