Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » తారా ప్రపంచంలో…తారక్ ప్రయాణం!!!

తారా ప్రపంచంలో…తారక్ ప్రయాణం!!!

  • August 10, 2016 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తారా ప్రపంచంలో…తారక్ ప్రయాణం!!!

“ఎన్టీఆర్” ఈ మూడు అక్షరాలే ప్రభంజనం…కొన్ని కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు. అయితే ఆయన వారసుడిగా జన్మించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత గురించి చెప్పిన కొన్ని ముచ్చట్లపై ఒక లుక్ వేద్దాం రండి…33వ పుట్టిన రోజు జరుపుకున్న ఎన్టీఆర్, దాదాపుగా 25సినిమాలు హీరోగా పూర్తి చేశాడు. కొన్ని కోట్ల మంది అభిమానుల గుండె చప్పుడుగా మారిపోయాడు. మాస్ ఫాలోయింగ్ విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా ఎన్టీఆర్ తరువాతే ఎవరైన అన్నంత మాస్ అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే అలాంటి ఎన్టీఆర్, తన 17 ఏళ్ల కరియర్ లో ఎన్నో ఆటుపోట్లకు గురయ్యాడు….పడిపోయిన కెరటం మళ్ళీ లేస్తుంది అన్నది ఎంత నిజమో, పరాభవం ఎదురైనప్పుడల్లా, ఎన్టీఆర్ పడి లేచిన కెరటంలా దూసుకుపోతున్నాడు…ఇంతకీ ఎన్టీఆర్ కు బలం ఎవరు? ఆయన్ని నడిపిస్తున్న శక్తి ఎవరు అంటే….రండి ఆయన మాటల్లోనే విందాం…తాత గారే పేరే నాకు శ్రీరామ రక్ష…తారక మంత్రమే నాకు సర్వజగద్రక్ష అంటున్నాడు యంగ్ టైగర్… ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలతో తాతగారు తన తలరాతను మార్చేసారు అంటున్నాడు మన బుడ్డోడు. ఆయన పేరు, ఆయన రూపం, ఆయన అభిమాన సంద్రం వెరసి, తనని స్టార్ హీరోగా నిలిపాయి అంటున్నాడు తారక్.

నా తొలి గురువు ‘అమ్మ’Jr NTR With His Motherచిన్న నాటి నుంచే స్కూలూ, క్రికెట్టూ, ఫ్రెండ్స్‌తో గొడవలూ, సినిమాలూ..షికార్లూ ఇలా ఒక్కటి కాదు, మనం చెయ్యని అల్లరి లేదు. అయితే అల్లరి చేసినప్పుడల్లా అమ్మ చేతిలో దెబ్బలు తినేవాణ్ణి. చేతికి ఏది దొరికితే దాంతో కొట్టేసేది. ఒక్కోసారి బెల్ట్ తెగేవరకూ కొట్టిన సంధర్భాలు ఉన్నాయి. అయితే అంత కోపంగా నన్ను దండించినా…కొంతసేపయ్యాక.. ఒంటికి మందు రాసి, భోరున ఏడ్చేసేది. ఎందుకంటే నేనంటే అంత ప్రాణం మా అమ్మకు. కోపంలో శివతాండవం చేసినా…ప్రేమతో దగ్గరకు తీసుకునేది. అలా వాస్తవంలో బతకడం నాకు అమ్మే నేర్పింది. జీవితంలో ఏదో ఒకటి చెయ్‌.. నిరూపించుకో.. లేదంటే మనుగడ కష్టం’ అంటూ నా తొలి గురువుగా మారి, నాలోని ఆత్మవిశ్వాసానికి పెరగడానికి ముఖ్య కారణం అయ్యింది.

తాతయ్య పిలుపు…ప్రాణం పోసింది!Jr NTR With Sr NTRతాతయ్యకు దూరంగా ఉంటున్న సమయంలో తాతయ్య నిన్ను చూడలట అన్న పిలుపు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. తాతయ్య ఇంటికి మొదటి సారి ‘తారక్‌ రామ్‌’ గా వెళ్ళిన నేను, ఆయన పుణ్యమా అని, తారక రామారావుగా మారిపోయాను. ఆయన గంభీర్యాం చూస్తే కొంచెం భయం అనిపించింది, అదే క్రమంలో ఆశ్చర్యం కలిగింది, నాకు తెలియకుండానే ఆనందంతో మది మురిసిపోయింది. ‘మేజర్‌ చంద్రకాంత్‌’ షూటింగ్‌ సమయంలో నాకు మేక్ అప్ వేయించి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాన్ని హిందీలోకి తీస్తున్నాం. అందులో భరతుడు మీరే’ అన్నారు. అంతకన్నా ఏం కావాలి, పట్టరాని సంతోషంతో మనసు ఊగిపోయింది. అలా ఆయనే నా తొలి దర్శకుడుగా నాకు నటనలో ఓనమాలు నేర్పించారు. ఇక ఆ తరువాత ఆయన పేరే తారక మంత్రంగా ఎక్కడా శిక్షణ తీసుకోకుండా ఆయన్నే గురువుగా తలచుకుంటూ ముందుకు సాగిపోయా.

బాల’రామాయణం’ గొప్ప అనుభవం!Balaramayanam, jr ntrనటనకు అర్ధం తెలియని వయసు, కెమెరా అంటే ఎంతో సరిగ్గా అర్ధం చేసుకోలేని వయసులో బాల రామాయణం చేశాను, ఆ అనుభవం చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. అయితే ఆ సినిమాను ఒక్క మాటలో చెప్పాలి అంటే పిల్లలతో తీర్చిదిద్దిన ఓ అద్భుతం అని చెప్పగలను.

‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ రిలీజ్‌ రోజున టికెట్లు దొరకలేదు!Jr NTR, Rowdy Inspector Movieబాబాయి సినిమా సంధ్య థియేటర్ లో రిలీజ్‌ రోజున చూసేందుకు వెళ్ళాను.. టికెట్లు దొరకలేదు. నాకే టిక్కెట్ ఇవ్వవా అన్న కోపంతో మేనేజర్‌తో గొడవ పెట్టుకున్నా. సినిమా చూస్తేగానీ ఇంటికి రానని చెప్పేశా. దాంతో నాన్నగారు ఫోన్‌ చేసి.. ‘వాడికో కుర్చీ వేసి చూపించండి’ అన్నారు. దాంతో ప్రత్యేకంగా ఓ కుర్చీ తీసుకొచ్చారు. మరోసారి టికెట్లు లేక ప్రొజెక్టర్‌ రూమ్‌లో కూర్చుని సినిమా చూశా.

తొలి పారితోషకం ఎంత అంటే!Jr NTR, Ninnu Choodalani Movieతొలి సారి హీరోగా చేసిన ‘నిన్ను చూడాలని’ సినిమాకు ఉషాకిరణ్‌ మూవీస్‌ వారు తొలి పారితోషికంగా రూ.3.5 లక్షలు నా చేతుల్లో పెట్టారు. అన్ని డబ్బులు ఒకేసారి చూడటం అదే మొదటి సారి. ఇంటికెళ్లి తలుపులేసుకొని లెక్కపెట్టాను. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. నెల రోజులూ అదే పని. ఇంట్లో మూల మూలల్లో దాచేవాడ్ని. అందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదనుకొన్నా. ఎవరైనా కాజేస్తారేమో అనే భయం కూడా వేసేది. అలా దాచీ దాచీ చివరికి మా అమ్మ చేతుల్లో పెట్టేశా… ఎంత సంపాదించినా తన కోసమే కదా అనిపించింది.

ఆ క్షణాలు ఇంకా గుర్తున్నాయి!Jr NTR Car Accident2009 మార్చి 26న జరిగిన కారు ప్రమాదం నా ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. ఆ క్షణాలు ఇంకా గుర్తు.. కన్నుమూసి తెరిచేలోగా ప్రమాదం జరిగిపోయింది. ఎక్కడెక్కడ ఎన్ని ఎముకలు విరిగాయో నాకే స్పష్టంగా తెలిసిపోయింది. ఒళ్లంతా రక్తం. సూర్యాపేట ఆసుపత్రికి వెళ్తుంటే.. నా జీవితమంతా కళ్ల ముందు కదిలింది. నా సినిమాలు, అమ్మ, అభిమానులు, నా వస్తువులు, చివరికి నేను పెంచుకుంటున్న కుక్కపిల్ల.. అన్నీ! ‘ఏంటి? జీవితం అయిపోయిందా?’ అనిపించింది. చచ్చిపోతానన్న భయం లేదు గానీ… ‘సాధించాల్సింది ఇంకా ఉంది కదా’ అనిపించింది.
అమ్మ దీవెనలు, అభిమానుల ఆశీర్వాదం, తాతయ్య ఆశీస్సులతో బతికి బట్టకట్టగలిగా.ఆ రోజు రెండోసారి పుట్టినట్లుగా అనిపించింది. ఇక ప్రణతి పుట్టిందీ అదే రోజు. అందుకే ప్రతీ ఏడాదీ మా ఇంట్లో మార్చి 26న రెండు పుట్టిన రోజులు జరుగుతాయి. ఆ ప్రమాదం నన్ను చాలా మార్చింది.. చాలా కూల్‌ అయ్యా. జీవితంపై దృక్పథం మారింది. బాధలో ఉన్నప్పుడు కూడా నవ్వడం నేర్చుకున్నా.

‘ప్రణతి’కి అన్నీ చెప్పేశా!Jr NTR With His Wifeసినీ పరిశ్రమలో రకరకాల పుకార్లు.. నాపై కూడా కొన్ని వచ్చాయి. వాటన్నింటి గురించీ క్లియర్‌గా తనకు చెప్పేశా. ‘నా పరిస్థితి ఇది, నా చుట్టూ ఇలాంటి మనుషులు ఉంటారు..’ అంటూ అన్నీ పూసగుచ్చినట్టు వివరించా. అందుకే మా ఇద్దరి మధ్యా ఎప్పుడూ ఎలాంటి సందేహాలూ, అనుమానాలూ చోటు చేసుకోలేదు.

నేను నమ్మే ఫిలాసొఫీ!jr ntr philosophyనా సిద్ధాంతం కొత్తగా వింతగా ఉంటుంది. ‘ఇదేంటి ఎన్టీఆర్‌ ఇలాక్కూడా ఆలోచిస్తాడా’ అనిపిస్తుంది.
మా అమ్మ పడుకునేటప్పుడు ‘పొద్దుట టిఫిన్‌ ఏం చేయను’ అని అడిగేది.‘పొద్దున్న లేవాలి కదమ్మా.. ఎవరికి తెలుసు..? ఇదే చివరి నిద్రేమో’ అనేవాడ్ని. నా ఆలోచనలు అలా ఉంటాయి. ‘ఆశ’ అనే ఓ చిన్న రేఖపై బతుకుతున్నాం మనం. ఏమో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈ చిన్న జీవితంలో ఇన్ని గొడవలెందుకు? అనిపిస్తుంది. సింపుల్‌గా ఉండడం నాకిష్టం. మనసులో ఒకటి.. బయటకు మరొకటి చేతకాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తా. కుటుంబం అంటే ప్రాణం. సినిమాలకంటే నాకు నా కుటుంబమే ముఖ్యం. అందుకే.. బయట ఎక్కువగా కనిపించను.

పండగొస్తే, నాలుగు రోజులు షూటింగ్‌ లేకపోతే ఇంట్లోనే మకాం. అందరం కలిసి పాత సినిమాలు చూస్తాం. తాతయ్య సినిమాల్ని అస్సలు వదలను. నటుడిగా, వ్యక్తిగా, రాజకీయ నేతగా నాకు ఆయనే ఆదర్శం. నా అభిమాన కథానాయకుడూ… ఆయనే.

చివరిగాSr Ntrఎన్టీఆర్ అన్న పేరే నా ఊపిరి…నా ధైర్యం…ఏం సాధించినా. ఎంత సంపాదించినా.. ఏం కోల్పోయినా…చివరికి నాతో ఎప్పటికీ నిలిచిపోయే అపురూపమైన ఆస్తి ఆ మూడు అక్షరాలు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bala Ramyanam
  • #Jr Ntr
  • #Jr NTR Accident
  • #Jr NTR Car Accident
  • #Jr Ntr Movies

Also Read

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

related news

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

Jr NTR New Look: ఎన్టీఆర్ ని ఇలా చూడడం.. ఫ్యాన్స్ కి కష్టమే..!

Jr NTR New Look: ఎన్టీఆర్ ని ఇలా చూడడం.. ఫ్యాన్స్ కి కష్టమే..!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

NtrNeel: ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ లీకులు… ‘డ్రాగన్‌’ సమస్యేంటి?  ఏం జరుగుతోంది?

NtrNeel: ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ లీకులు… ‘డ్రాగన్‌’ సమస్యేంటి? ఏం జరుగుతోంది?

Naga Vamsi: అలా ఎలా నమ్మేస్తారు.. సినిమా చూడకుండానే ‘వార్‌ 2’ కొనేశారా? టూమచ్‌!

Naga Vamsi: అలా ఎలా నమ్మేస్తారు.. సినిమా చూడకుండానే ‘వార్‌ 2’ కొనేశారా? టూమచ్‌!

trending news

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

24 mins ago
Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

33 mins ago
Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

2 hours ago
Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

17 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

17 hours ago

latest news

Honey Rose: సినిమాలు కంటే, ‘రిబ్బన్ కటిగ్స్ తోనే గట్టిగా సంపాదిస్తున్న బ్యూటీ

Honey Rose: సినిమాలు కంటే, ‘రిబ్బన్ కటిగ్స్ తోనే గట్టిగా సంపాదిస్తున్న బ్యూటీ

6 mins ago
Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎంత ముద్దుగా చెప్పిందో టాలీవుడ్‌ ఊతపదం

Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎంత ముద్దుగా చెప్పిందో టాలీవుడ్‌ ఊతపదం

14 mins ago
VARANASI: రాజమౌళి టార్గెట్.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా?

VARANASI: రాజమౌళి టార్గెట్.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా?

28 mins ago
Raju Weds Rambai: కల్ట్ ప్రేమకథల సరసన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’.. ఆ డైరక్టర్‌ నమ్మకం చూశారా?

Raju Weds Rambai: కల్ట్ ప్రేమకథల సరసన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’.. ఆ డైరక్టర్‌ నమ్మకం చూశారా?

36 mins ago
Sai Dharam Tej: ఎట్టకేలకు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్..!

Sai Dharam Tej: ఎట్టకేలకు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్..!

37 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version