ఏప్రిల్ 8న అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులకు రెండు గుడ్ న్యూస్‌లు ఉంటాయి అని వార్తలొస్తున్నాయి. అవేంటో అందరికీ దాదాపు తెలిసిన విషయాలే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బన్నీకి సంబంధించి రెండు సినిమాల గురించి వార్తలు వస్తున్నాయి. అవే త్రివిక్రమ్ (Trivikram) సినిమా, అట్లీ (Atlee Kumar) సినిమా. సల్మాన్ ఖాన్ (Salman Khan) రీసెంట్‌గా చేసి కొన్ని కామెంట్ల వల్ల అల్లు అర్జున్‌తో అట్లీ సినిమా ఫిక్స్ అని దాదాపు తేలిపోయింది. దీంతో బన్నీ పుట్టిన రోజు నాడు రెండు సినిమాల అప్‌డేట్‌లు వస్తాయని ఫిక్స్ అయిపోయారంతే.
అయితే, ఈ రెండు సినిమాలూ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో ఫస్ట్‌లుక్‌లు, గ్లింప్స్ వీడియోలు ఏవీ వచ్చే అవకాశం లేదు. ఓ పోస్టర్ లేదంటే మోషనల్ పోస్టర్ మాత్రం వచ్చే అవకాశం ఉంది అనుకున్నారంతా. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ అట్లీ సినిమా టీమ్ నుండి ఓ వీడియో వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సినిమా కాన్సెప్ట్‌ని చెప్పేలా ఓ యానిమేటడ్ వీడియోను విడుదల చేస్తారు అని వార్తలొస్తున్నాయి. బన్నీ వాయిస్‌తోనే ఈ వీడియో ఉంటుంది అని చెబుతున్నారు.
అయితే నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) రీసెంట్ అనౌన్స్‌మెంట్ బన్నీ లైనప్ విసయంలో డౌట్స్ క్రియేట్ చేసింది. ఆయన మాటలు వింటుంటే అట్లీ సినిమా అయితే వెనక్కి వెళ్లాలి, లేదంటే వేగంగా పూర్తవ్వాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే మరో ఐదు నెలల్లో అంటే అక్టోబరులో స్టార్ట్ చేస్తాం అని చెప్పారు. పురాణాల ఆధారంగా సాగే కథతో సినిమా రూపొందుతుందని కూడా చెప్పారు. రూమర్స్ ప్రకారం అట్లీ సినిమా మేలో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ స్టార్ట్ అయితే నాలుగు నెలల్లో ఆ సినిమా పూర్తవ్వాలి.
అట్లీ సినిమా పూర్తిగా మాస్‌గా ఉంటుంది. ఇటు త్రివిక్రమ్ సినిమా పురాణాల నేపథ్యం.. కాబట్టి రెండు లుక్‌ల మధ్య చాలా మేకోవర్ అవసరం. అది జరగాలి అంటే చాలా గ్యాప్ అవసరం. ఈ లెక్కన అట్లీ సినిమా లేకపోవాలి. లేదంటే అక్టోబరులో త్రివిక్రమ్ సినిమాకు లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి పక్కన పెట్టాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో? ఈ అన్ని ప్రశ్నలకు ఎనిమిదో తేదీ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే అదెలా అనేది చూడాలి.