SPY: ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో నిఖిల్ ‘స్పై’ మూవీ టీజర్..!

నిఖిల్ నుండి ‘కార్తికేయ2’ తర్వాత రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘స్పై’. ఇది కూడా ‘పఠాన్’ లానే స్పై థ్రిల్లరే. కానీ లేటెస్ట్ గా వచ్చిన టీజర్ చూస్తుంటే… ఇది ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందింది అని తెలుస్తుంది. సుభాష్ చంద్రబోస్ యొక్క మరణం.. దాని వెనుక ఉన్న రహస్యాన్ని ఆధారం చేసుకుని ఈ మూవీ తెరకెక్కినట్టు టీజర్ చెబుతుంది.ఒక నిమిషం 38 సెకన్లు నిడివి కలిగిన ఈ చిత్రం టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడు అన్నది ఓ కవర్-అప్ స్టోరీ అన్నట్టు టీజర్లో చూపించారు. నిఖిల్ ‘స్పై’ గా కనిపిస్తున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్ద పీట వేశారు. ఎడిటర్ గ్యారీ బి.హెచ్ డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన చిత్రమిది. కానీ ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిగా అతను ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు టీజర్ చెబుతుంది. ఐశ్వర్య మీనన్ , సన్యా ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఆర్యన్ రాజేష్ ఈ చిత్రంతో మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘ఈడి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప‌ల‌పాటిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 29న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus