ప్రిన్స్ మహేష్ బాబు, అటు మాస్ ఫ్యాన్స్, ఇటు క్లాస్ ఫ్యాన్స్ మొత్తంగా కలసి ఉన్న అతి తక్కువ మంది హీరోల్లో మన ప్రిన్స్ మహేష్ ఒకరు. అయితే వరుస హిట్స్ తో మంచి ఊపుమీద ఉన్న ప్రిన్స్ కి అనుకోకుండా భారీ డిజాస్టర్ ఎదురుకావడంతో, దాని నుంచి బయట పదే క్రమంలో భారీ సినిమానె ఎంచుకుని దూసుకెళ్తున్నాడు. అయితే తమిళ సంచలన దర్శకుడు మురుగుదాస్ తో భారీ బడ్జెట్ మూవీని చేస్తున్న మహేష్ బాబు ఆ సినిమా కి స్పైడర్ అన్న పేరును పెట్టాడని అందరికీ తెలిసిందే. అయితే అదే క్రమంలో ఆ స్పైడర్ ఫర్స్ట్ లుక్ తోనే మంచి వ్యూస్ అందుకున్న ప్రిన్స్ నిన్న స్పైడర్ టీజర్ విడుదల చేసి యూ ట్యూబ్ ని షేక్ చేసేసాడు.
వివరాల్లోకి వెళితే, మురుగుదాస్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న ‘స్పైడర్’ మూవీ టీజర్ నిన్న విడుదలయిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఈ టీజర్ విడుదలైన 5 గంటల్లో 1.5 మిలియన్ వ్యూస్ ని రికార్డ్ ని సృష్టిస్తుంది.తెలుగు చిత్రాల్లో ఇప్పటివరకు మరే చిత్ర టీజర్ కి విడుదలైన 5 గంటల్లో ఇంత మంచి రెస్పాన్స్ లభించలేదు. ప్రిన్స్ లుక్ తో పాటు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్ కి ప్లస్ అనే చెప్పాలి. మంచి స్పై-థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మురుగుదాస్. ఇక ఈ సినిమాలో మన ప్రిన్స్ తో రొమ్యాన్స్ చెయ్యనుంది రకుల్. మొత్తంగా చూసుకుంటే ఈ స్పైడర్ దసరాకి బాక్స్ ఆఫీస్ ని దడదడలాడిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.