తెలుగునాట సినిమాల్లో, రాజకీయాల్లో సక్సెస్ సాధించిన వాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ మరణించి 25 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఎన్టీఆర్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు బుల్లితెరపై, యూట్యూబ్ లో మంచి వ్యూస్, మంచి రేటింగ్స్ దక్కుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయనపై ఉన్న అభిమానంతో ఖమ్మం జిల్లాలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్ బండ్ పై ఈ విగ్రహం ఏర్పాటు కానుండగా ఈ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విగ్రహం కొరకు దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. నిజామాబాద్ లో ఈ విగ్రహాన్ని తయారు చేయించారని ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరగనుందని సమాచారం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేత ఈ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని బోగట్టా.
సీనియర్ ఎన్టీఆర్ కృష్ణావతారంలో ఉన్న ఈ విగ్రహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విగ్రహం ఏర్పాటు విషయంలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం తమ వంతు పాలు పంచుకుంటూ ఉండటం గమనార్హం. 1,000 అడుగుల విస్తీర్ణంలో ఈ విగ్రహాన్ని బేస్ మెంట్ పై అమర్చనున్నారని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ పై అభిమానుల్లో సంవత్సరాలు గడుస్తున్నా ఇసుమంతైనా అభిమానం తగ్గకపోవడం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు ఇతర నందమూరి హీరోలు కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యే ఛాన్స్ ఉంది.
మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 18వ తేదీన లేదా ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ కానుంది. ఏప్రిల్ 28వ తేదీనే ఈ సినిమా రిలీజవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాహుబలి2 సెంటిమెంట్ ను ఆర్ఆర్ఆర్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బాహుబలి2 రిలీజైన రోజునే ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే ఛాన్స్ ఉండటంతో ఫ్యాన్స్ ఈ కామెంట్లు చేస్తున్నారు.