Sree Mukhi: సైమా అవార్డ్స్ కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన శ్రీముఖి?

బుల్లితెర రాములమ్మగా ఎంతో పేరు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తెలుగు బుల్లితెర కార్యక్రమాలకు సుమా తరువాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ గా పేరు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం వరుస కార్యక్రమాలతో పాటు సినిమా ఈవెంట్లు, బుల్లితెర ప్రత్యేక కార్యక్రమాలు, అవార్డు ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా సైమా అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమాలకి అలీతో కలిసి యాంకర్ గా వ్యవహరించారు.

రెండు రోజులపాటు బెంగళూరులో జరిగిన ఈ సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో శ్రీముఖి పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా రెండు రోజులు పాటు జరిగిన ఈ కార్యక్రమానికి ఈమె భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా శ్రీముఖి ఒక్కో కాల్ షీట్ కోసం దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. అయితే సైమా అవార్డు వేడుకలో భాగంగా రెండు రోజులపాటు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో

ఈమె ఏకంగా నిర్వాహకుల నుంచి పది లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఈ విధంగా శ్రీముఖి ఈ కార్యక్రమం కోసం పది లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో తెలియడంతో రెండు రోజులకు 10 లక్షల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని భావిస్తున్నారు తెలుగు బుల్లితెరపై సుమ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న యాంకర్ శ్రీముఖి అనే చెప్పాలి.రెండు రోజులకు 10 లక్షల రెమ్యూనరేషన్ అంటేనే ఈ బుల్లితెర రాములమ్మ క్రేజ్ ఎలా ఉందో అందరికీ అర్థమవుతుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus