Bigg Boss Telugu 6: శ్రీసత్యకి చురకలు వేసిన తండ్రి..! ఆవేదనలో తల్లి..! వాళ్ల బాధ ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన దగ్గర్నుంచీ కూడా శ్రీసత్య గేమ్ చాలా విభిన్నంగా సాగింది. తన పొగరు, యాటిట్యూడ్, అంహకారం, ఎదుటి వాళ్ల మాటల్ని పట్టించుకోకపోవడం, ఏదైనా గేమ్ కోసమే ఉన్నానని చెప్పడం, అర్జున్ కళ్యాణ్ ని కేవలం గేమ్ కోసమే కలుపుకోవడం, ఇలా ఎన్నో కోణాలు చూపించింది. ఇవి ఆడియన్స్ దృష్టిలో కొన్ని ప్లస్ అయితే, మరికొన్ని మైనస్ అయ్యాయి. కానీ, ఇప్పుడు శ్రీసత్య పేరంట్స్ రాకతో అవన్నీ పటాపంచలు అయిపోయాయి.

ముఖ్యంగా శ్రీసత్య తల్లి వీల్ ఛైర్ లో ఎంట్రీ ఇవ్వగానే హౌస్ మేట్స్ తో పాటుగా, ఆడియన్స్ కూడా కంటతడి పెట్టేశారు. నిజానికి ఆమెకి ఈ పరిస్థితి రావడానికి కారణం శ్రీసత్యనే. తను సూసైడ్ అటెమ్ట్ చేసినపుడు తన తల్లికి స్ట్రోక్ వచ్చి అలా అయ్యింది. ఈవిషయాన్ని చాలాసార్లు బిగ్ బాస్ హౌస్ లో శ్రీసత్య చెప్పింది కూడా. అయితే, ఇప్పుడు వీల్ ఛైర్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా అందరి హృదయాలు చలించిపోయాయి.

ఇక హౌస్ లో శ్రీసత్య తండ్రి ఆమెకి చురకలు వేస్తునే ఉన్నారు. ఇంట్లో చక్కగా ఉండేదానికి ఇక్కడికి వచ్చాక ఎందుకు వెటాకారంగా మాట్లాడుతున్నావ్ అంటూ అడిగారు. అలాగే, నామినేషన్స్ అప్పుడు నవ్వడం, సిల్లీగా పాయింట్ లేకుండా చేయడం కూడా చేస్తున్నావ్ అంటూ చురకలు వేశారు. అందరూ గేమ్ బాగా ఆడుతున్నారని, ముఖ్యంగా రేవంత్ పుష్పలాగా తగ్గేదేలే అంటూ బురద నామినేషన్స్ లో ఇరగదీశాడని చెప్పారు. అలాగే, కుంబస్థలాన్ని కొట్టాలంటే ధైర్యం కావాలని, దానికోసం తెగిస్తూ పోరాడాలని చెప్పారు.

ఆటలో తోలు ఊడిపోయినా పర్లేదు గట్టిగా ఆడాలని చెప్పారు. అందరు హౌస్ మేట్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ చాలామంది నామినేషన్స్ పాయింట్స్ సరిగ్గా లేవని అభిప్రాయపడ్డారు. శ్రీసత్య వాళ్ల అమ్మకి అన్నం తినిపిస్తూ బాగా ఎమోషనల్ అయిపోయింది. అలాగే తండ్రి వెళ్లిపోతుంటే బాధపడింది. కళ్లతోనే వాళ్ల అమ్మతో మాట్లాడింది. ఇంట్లో తినడానికి మాత్రమే డబ్బులు ఉన్నాయని, వేరేవాళ్లు ఎవరూ సాయం చేయట్లేదని, దీంతో అమ్మకి ఫిజియోథెరపీ ఆపేశారని చెప్పింది.

ఆ విషయం వాళ్లు చెప్పకపోయినా కూడా నాకు తెలుస్తోందని చెప్పింది. ఇక శ్రీసత్య పేరెంట్స్ ని చూసి మిగతా హౌస్ మేట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. అయితే శ్రీసత్య తండ్రితో మాత్రం రేవంత్, ఇంకా శ్రీహాన్ ఇద్దరూ చాలా సరదాగా మాట్లాడారు. మొత్తానికి శ్రీసత్య ఫ్యామిలీ రాక ఎపిసోడ్ లోనే హైలెట్ గా నిలిచింది. మరి ఈవారం తను సేఫ్ అయితే టాప్ 5కి చేరుతుందా లేదా అనేది చూడాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus