సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బాహుబలి (Baahubali) , ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి ప్రపంచ స్థాయి బ్లాక్‌బస్టర్ల తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా కావడం, పైగా ఇందులో మహేష్ పూర్తిగా కొత్తగా కనిపించనున్నాడు అనే విషయం సినిమాపై హైప్ ను రెట్టింపు చేస్తోంది. ఇప్పటి వరకు మేకర్స్ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా పెద్దగా ఏమీ వెల్లడించలేదు.
లొకేషన్ స్పాట్ ఫొటోలు, ఫ్యాన్ క్లిక్స్ తప్ప, పోస్టర్, టీజర్ వంటి ప్రమోషనల్ మెటీరియల్ దాని బాగంలోకి రాలేదు. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రాజమౌళి టీమ్ ఓ భారీ గ్లింప్స్ వీడియోను రూపొందించడానికి సిద్ధమవుతోందట. ఈ గ్లింప్స్ ద్వారా మహేష్ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని కీలక పాయింట్స్, సినిమా టోన్‌ను సూచించేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండారట. ఇది కేవలం టైటిల్ రివీల్ కాదు..
గ్రాఫిక్స్, విజువల్ ట్రీట్‌మెంట్ కలిపి ప్రపంచ ప్రేక్షకులకు మహేష్ స్టైల్‌లో ఉంటుందని టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ విజ్యువలైజేషన్ పనులు వేగంగా సాగుతున్నాయని సమాచారం. ఇక గ్లింప్స్ విడుదల ఎప్పుడు అనే దానిపై అఫీషియల్ క్లారిటీ లేకున్నా, జూన్ లేదా జూలైలో రావచ్చనే టాక్ ఉంది. మహేష్ బాబు ఇప్పటి వరకు చేసిన పాత్రలతో పోలిస్తే ఇందులో ఆయన పాత్ర పూర్తిగా విభిన్నంగా ఉండనుంది.
ఓ గ్లోబల్ ట్రావెలర్ గానే కాకుండా, ఫిజికల్ గా, ఎమోషనల్ గా భారీ ఛాలెంజ్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఇక ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రల్లో నటిస్తుండటం మరో హైలైట్. ఎంఎం కీరవాణి (M. M. Keeravani) సంగీతం అందిస్తుండగా, శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో (SSMB29) ఇండియన్ సినిమా రేంజ్ ఇంకో స్థాయికి వెళ్లబోతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు అసలు గ్లింప్స్ ఎప్పుడు వస్తుందన్నది చూడాల్సిందే.