కొద్ది రోజులుగా ప్రపంచప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్స్ (2023) కోసం ప్రపంచ దేశాలతో పాటు ఇండియా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది.. ఆ ఉత్కంఠతకు తెరదించుతూ సోమవారం (మార్చి 13) తెల్లవారు ఝామున 95వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.. ఈసారి రెండు ఇండియన్ సినిమాలు ఆస్కార్ గెలుచుకున్నాయి.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ‘నాటు నాటు’ అవార్డులు వచ్చాయి..
ఈ సందర్భంగా ఆస్కార్ గురించి పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇటీవల ఆస్కార్ అవార్డ్ తయారీకయ్యే ఖర్చు, ఎలా తయారు చేయిస్తారు వంటి విషయాలు తెలిశాయి.. అయితే ఈ అవార్డ్‌ని అమ్మకూడదు.. అలా అమ్మితే వచ్చే రేటు గురించి తెలిసి షాక్ అయ్యారు.. అవార్డు తయారు చేయడానికి 400 డాలర్లు ఖర్చవుతుందని సమాచారం. కానీ ఒకవేళ ఈ అవార్డుని అమ్మాలి అనుకుంటే మాత్రం ఒక్క డాలర్ మాత్రమే వస్తుందట.
ఈ అవార్డుని అమ్ముకోవాలని గతంలో ఓ అమెరికన్ డైరెక్టర్ భావించాడు. కానీ అమ్మడం కంటే వేలం వేసి చూద్దాం అని అతను ట్రై చేస్తే ఏకంగా రూ.6 కోట్లు వచ్చాయట. తర్వాత అవార్డ్ అమ్మకం విషయంలో కమిటీ ఈ ఒక్క డాలర్ నిర్ణయం తీసుకుంది.. ఇదిలా ఉంటే గతంలో ఓ హాలీవుడ్ యాక్టర్ కుమార్తె ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆస్కార్ అవార్డ్ అమ్మేసిందట.. ఆర్సన్ వెల్లెస్ ( Orson Welles) నటిస్తూ.. దర్శక నిర్మాతగా ‘సిటిజన్ కేన్’ (Citizen Kane) మూవీ తీశారు..
పలు కేటగిరీల్లో నామినేషన్స్ సాధించిన ఈ ఫిలిం ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’ విభాగంలో అవార్డ్ సాధించింది.. మరో రైటర్ హెర్మన్‌తో పాటు ఆర్సన్ ఈ అవార్డ్ అందుకున్నారు.. తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆర్సన్ కుమార్తె బీట్రైస్ వెల్లెస్ ఈ అవార్డును అమ్మేసిందట.. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఇప్పటి వరకు పలువురు వివిధ పరిస్థితుల వల్ల మొత్తంగా 150 ఆస్కార్ అవార్డులను అమ్మేసుకున్నారట..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్