ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై (Saif Ali Khan) కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి ఓ దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దాడి జరిగాక ఏమైంది లాంటి వివరాలు పోలీసులు విచారణ పూర్తయిన తర్వాత చెబుతారు. అయితే ఈ లోపు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఆ సమయంలో సైఫ్ ఇంట్లో సెక్యూరిటీ లేదా? ఉంటే ఏం చేస్తున్నారు అని. ఇదే విషయాన్ని ఓ బాలీవుడ్ నటుడు ప్రశ్నించాడు.
Saif Ali Khan
సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) పై దాడి గురించి గత కొన్ని రోజులుగా సీనియర్ ఆకాశ్ దీప్ సబీర్ ఏదో మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా తన భార్య షెబాతో కలసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సైఫ్, కరీనాపై తీవ్ర విమర్శలు చేశారు. సినిమాలు చేస్తూ కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న ఇద్దరూ ఇంటి దగ్గర సరైన భద్రత ఏర్పాటు చేసుకోకపోవడాన్ని ఆకాశ్ దీప్ సబీర్ తప్పు పట్టారు. ఇలా ఎందుకు జరిగిందో వాళ్లే చెప్పాలి అనేలా మాట్లాడారాయన.
కరీనా కపూర్ ఓ సినిమాకు రూ.21 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని బాలీవుడ్‌లో టాక్. కానీ తమ ఇంటి బయట ఫుల్ టైమ్ వాచ్‌మెన్‌ను నియమించుకోలేదు. రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తే అప్పుడు సెక్యూరిటీ, డ్రైవర్‌ను పెట్టుకుంటారేమో అని సెటైర్లు వేశారు ఆకాశ్‌దీప్. కరీనా తనకు ఎంతోకాలంగా తెలుసని.. చిన్నపిల్లగా ఉన్నప్పటినుండి ఆమెను చూస్తున్నా అని చెప్పారాయన.
కరిష్మా కపూర్ నటించిన తొలి చిత్రానికి ఆకాశ్‌దీప్ సబీర్ దర్శక నిర్మాత. సైఫ్‌పై దాడి తర్వాత ఆకాశ్ దీప్ చాలా టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొని వారిద్దరి కోసం మాట్లాడారు. ఈ క్రమంలో తనకు రెండు ప్రశ్నలు ఎదురైనప్పుడు జవాబు ఇవ్వలేకపోయానని చెప్పారు. దాడి సమయంలో ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఎందుకు లేరు?’, దాడి జరిగాక చాలాసేపటికి ఆటోలో ఎందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారికి ఫుల్‌టైమ్ డ్రైవర్లు లేరా? అని ఎవరైనా అడిగితే తన దగ్గర సమాధానం లేదు అని చెప్పారాయన .