ప్రభాస్ ను అడ్డం పెట్టుకుని ఆ హీరోయిన్ ఎవరి పై సెటైర్లు వేసింది?

ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. అలనాటి హీరోయిన్ భాగ్య శ్రీ.. ప్రభాస్ తల్లిగా నటిస్తుంది. భాగ్య శ్రీ.. గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘యువరత్న రాణా’ అనే చిత్రంలో చెల్లి పాత్రలో కనిపించింది. బాలీవుడ్లో ఈమె హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇటీవల భాగ్య శ్రీ ప్రభాస్ పై చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

భాగ్య శ్రీ మాట్లాడుతూ.. ‘బాహుబలి’ చూసినప్పుడే ప్రభాస్ పై నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇప్పుడు అతను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కానీ ఒక సూపర్ స్టార్ కు ఉండే గర్వం, అహంకారం వంటి లక్షణాలు అతనిలో నేను చూడలేదు. ప్రభాస్ ఎంతో ‘డౌన్ టు ఎర్త్’ అన్నట్టు ఉంటాడు. అందరితో ఇట్టే కలిసి పోతాడు. అందరికీ మర్యాద ఇచ్చే అతని పద్ధతిని కూడా చూసి నేను ఆశ్చర్యపోయాను. అందరితో చాలా క్లోజ్ గా మాట్లాడతాడు… అతనొక టీమ్ ప్లేయర్’ అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది.

అంతా బాగానే ఉంది కానీ.. ‘సూపర్ స్టార్ల కు ఉండే గర్వం, అహంకారం వంటివి ప్రభాస్ లో లేవు’ అని భాగ్య శ్రీ చెప్పడమే కొంత ఆలోచింప చేసే విషయం. ‘ఆమె కొన్నాళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యింది.. బహుశా ఆ టైములో సూపర్ స్టార్ల వల్ల ఈమె ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొని ఇండస్ట్రీకి దూరమయ్యిందా’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతుండడం గమనార్హం.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Share.