పురాతన ప్రత్యేక వస్తువులను, ప్రముఖులు ధరించిన వస్తువులను వేలంలోకి తీసుకురావడం.. వాటికి భారీ దర పలకడం మనం చూస్తూనే ఉన్నాం. అలా బ్రిటన్‌కు చెందిన దివంగత నటి, గాయని జేన్ బర్కిన్ వాడిన ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ హర్మీస్ రూపొందించిన ఓ బ్యాగ్‌ను ఇప్పుడు వేలం వేయగా రికార్డు ధర పలికింది. పారిస్‌లోని ప్రముఖ ఆక్షన్ హౌస్ సోథీబే నిర్వహించిన వేలంలో ఈ బ్యాగ్‌కు సుమారు రూ.85 కోట్లు వచ్చాయి. జపాన్‌కు చెందిన ఓ ప్రైవేటు కలెక్టర్ ఈ బర్కిన్ బ్యాగ్‌ను 8.58 మిలియన్ యూరోలకు సొంతం చేసుకున్నారు.
ఆ బ్యాగుకు అంత ధర ఎందుకు అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే దీని వెనుక పెద్ద కథే ఉంది. 1980ల్లో బర్కిన్ ఫేమస్ నటి. ఆమె ఓసారి పారిస్ నుండి లండన్ ప్రయాణం చేస్తుండగా హర్మీస్ నాటి యజమాని జీన్ లూయీస్ డ్యూమస్ పరిచయమయ్యారు. ఆ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుకుంటుండగా.. ఓ బిడ్డకు తల్లిగా తనకు కావాల్సిన రీతిలో మంచి బ్యాగు దొరకడం లేదని బర్మీన్ చెప్పారట. ఆ తర్వాత కొన్ని రోజులకు హర్మీస్ సంస్థ ఓ స్పెషల్ బ్యాగు సిద్ధం చేసింది.
చిన్న పిల్లలను వెంట తీసుకెళ్లే తల్లుల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఆ బ్యాగ్ రూపొందిందింది. ఆ బ్యాగ్‌కు ‘బర్కిన్’ అని పేరు కూడా పెట్టింది. ఆ బ్యాగ్‌ను బర్కిన్ తరచూ వెంట తీసుకెళ్లేవారు. దానిపై JB అనే అక్షరాలు కూడా ఉంటాయి. కొన్నేళ్లు ఆ బ్యాగ్‌ను వినియోగించిన ఆమె ఆ తర్వాత హర్మీస్‌కు ఇచ్చేశారు. 1994 సమయంలో ఆ బ్యాగను వేలం వేసి ఆ డబ్బును ఎయిడ్స్ ఛారిటీకి అందజేశారు. అక్కడికి కొన్నేళ్ల తర్వాత పారిస్‌కు చెందిన కేథరిన్ బెనియర్ వేలంలో బ్యాగ్‌ను దక్కించుకున్నారు.
ఇప్పుడు అంటే సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ బ్యాగు సోథిబే సంస్థ వేలం వేసింది. మిలియన్ యూరోలతో మొదలైన వేలం.. 8.58 మిలియన్ యూరోలకు చేరింది. ఓ హ్యాండ్‌బ్యాగ్‌కు ఈ స్థాయి ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఆ డిజైన్‌లో ఉన్న బ్యాగులను హర్మీస్ ఇప్పటికే విక్రయిస్తోంది. వీటి ధర సుమారు 10 వేల డాలర్ల వరకు ఉంటోంది.