‘నా ప్రియుడు నన్ను చావు దెబ్బలు కొట్టి చిత్ర హింసలు పెట్టాడు’ అంటూ ఓ నటి సోషల్ మీడియాని ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మలయాళ నటి అనికా విక్రమన్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా ఆమెకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు నెటిజెన్లతో చాట్ సెషన్లు వంటివి కూడా నిర్వహిస్తోంది. అయితే సడన్ గా ఈమె కొన్ని ఫోటోలను షేర్ చేసి..
తన ప్రియుడు తనను దారుణంగా కొట్టినట్టు తెలిపింది.అనికా విక్రమన్ తన మాజీ ప్రియుడు అనూప్ పిళ్లై మానసికంగా, శారీరకంగా తనను దారుణంగా కొట్టి రూపురేఖలు లేకుండా చేశాడని చెప్పి షాక్ కు గురిచేసింది. గాయాలతో ఉన్న ఈమె ఫోటోలను కూడా షేర్ చేయడం గమనార్హం. అంతేకాదు కాదు అనూప్ పిళ్లై పై పోలీసు కేసు కూడా పెట్టిందట.’నన్ను అతను తీవ్రంగా వేధిస్తున్నాడు. అతని వల్ల నా ప్రాణానికి కూడా ముప్పు పొంచి ఉంది’ అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేస్తుంది.
అనూప్ తనను ఏ రకంగా హింసించాడో వివరిస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. ‘ఈ ఘటన కొద్దిరోజుల క్రితమే జరిగింది. అప్పట్లో పిళ్లై బాగానే ఉండేవాడు కానీ తర్వాత ఎందుకో రాక్షసుడిలా మారిపోయాడు. అతని నుండి దూరంగా వచ్చేసినా వదిలిపెట్టడం లేదు.అతని నుండి నాకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. నన్ను మరియు నా కుటుంబాన్ని అంతం చేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు’ అంటూ అనికా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్టు, షూటింగ్‌లకు హాజరవుతున్నట్టు కూడా తెలిపింది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటో అలాగే నాట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మలయాళం సినీ పరిశ్రమలో కూడా ఇది హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. అనికా విక్రమన్ కు మద్దతు పలికే వారి సంఖ్య కూడా క్రమ క్రమంగా పెరుగుతుండడం గమనార్హం.