కంగారు పడకుండా మంచి నిర్ణయం తీసుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన జంట.!

ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ ఏడాది చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. అందులో హీరోయిన్ నటి సుష్మితా సేన్‌ తమ్ముడు అలాగే ప్రముఖ మోడల్‌ అయిన రాజీవ్‌ సేన్‌ మరియు అతని భార్య,నటి అయిన చారు అసోపా కూడా ఉన్నారు.రాజీవ్‌కు చారు విడాకుల నోటీసులు కూడా పంపినట్టు ఆమె బహిరంగంగానే చెప్పుకొచ్చింది. దీంతో ఈ జంట విడిపోయినట్టే అని అంతా ఫిక్స్ అయిపోయారు.

కానీ ఎవ్వరూ ఊహించని విధంగా వారి కూతురు జియానా కోసం కలిసి ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలిపి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ‘పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. దానిని మేం మార్చేదేముంది. మా వివాహ బంధానికి మేము స్వస్తి చెప్పాలనుకున్న మాట నిజం.అధికారికంగా ప్రకటించాం కూడా.! మా మధ్య ఏం లేదు అని చివరి దశకు చేరుకునే లోపు మా విడాకుల నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోవడానికి డిసైడ్ అయ్యాం.

విడాకులు అనేవి మా ఎంపిక మాత్రమే అని తెలుసుకున్నాం. మా వైవాహిక జీవితానికి కామాతో సరిపెట్టి ఇక సంతోషంగా కొనసాగించాలని డిసైడ్ అయ్యాము. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులుగా మా కూతురు జియానాకు ఉత్తమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. తన భవిష్యత్తు, సంతోషమే మా మొదటి ప్రాధాన్యత..

జంటగా మాకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ వస్తున్న అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపుకుంటున్నాం. ప్రేమతో మా కూతురిని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ వారు చెప్పుకొచ్చారు. అంతేకాదు వినాయక చవితిని కలిసి సెలబ్రేట్ చేసుకుని ఆ ఫోటోలను కూడా షేర్ చేశారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus