అతనొక యంగ్ హీరో. దాదాపు 16 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. మొదట్లో పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. తర్వాత హీరోగా రెండు సినిమాలు చేశాడు. అందులో ఒకటి జస్ట్ యావరేజ్ గా ఆడింది. ఇంకోటి రిలీజ్ ఇబ్బందులు ఎదుర్కొని తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఓ పెద్ద నిర్మాతని కలిసి తన వద్ద ఉన్న ఓ కథ చెప్పాడు. ఆ నిర్మాతకి నచ్చడంతో ఆ సినిమాని మీడియం బడ్జెట్లో నిర్మించి హిట్ కొట్టారు.
తర్వాత దానికి సీక్వెల్ కూడా రూపొందింది. అది కూడా బాగా ఆడింది. ఈ సినిమాల షూటింగ్ల టైంలో హీరోయిన్ ను (Heroine) బాగా లైన్లో పెట్టారు హీరోగారు. తర్వాత మార్కెట్ పెరగడంతో ఆమెకు మొహం చాటేశారు. కట్ చేస్తే ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. హీరోని నిలదీస్తే ‘డోంట్ కేర్’ అన్నట్టు మాట్లాడాడు. దీంతో ఛాంబర్ కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. అయినా హీరోగారు తగ్గలేదు. సరిగ్గా ఈ టైంలో నిర్మాత ఎంట్రీ ఇచ్చి.. ‘ఎంతో కొంత తీసుకుని సైలెంట్ అవ్వమని’ కోరాడట. ఇది హీరోకి అస్సలు ఇష్టం లేదు.
అయినా సరే అతన్ని కూల్ చేసి.. ‘నువ్వు ఛాంబర్ కి వెళ్లినా అక్కడ కూడా సెటిల్మెంట్ కి మమ్మల్నే పిలుస్తారు. కాబట్టి అక్కడికి వెళ్లి పరువు పోగొట్టుకోకుండా ఇక్కడే మాట్లాడుకుని సెటిల్ చేసుకుందామని హీరోయిన్ కి నచ్చజెప్పాడట నిర్మాత. తర్వాత కొంత అమౌంట్ కి ఇప్పించి సెటిల్ చేయించినట్లు తెలుస్తోంది. తర్వాత ఆమె (Heroine) ఇనీషియల్ స్టేజిలోనే అబార్షన్ చేయించుకుని సైలెంట్ అయినట్లు సమాచారం. ఆ హీరోకి తర్వాత ప్లాపు పడింది. మరి అతని నెక్స్ట్ సినిమాల ప్లానింగ్, కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.