సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2022 సెకండాఫ్ లో చాలా మంది సినీ సెలబ్రిటీలు కన్నుమూశారు. ఈ ఏడాది ఆరంభంలో అయితే ‘వారసుడు’ ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూశారు. అటు తర్వాత సీనియర్ దర్శకుడు సాగర్ కూడా మరణించారు. ఇక ఫిబ్రవరిలో అయితే కళాతపస్వి కె.విశ్వనాథ్, అలాగే నందమూరి తారకరత్న, విశ్వనాథ్ గారి భార్య జయలక్ష్మీ వంటి వారు కన్నుమూశారు. ఫిబ్రవరి నెలలో తగిలిన షాక్ కు ఇండస్ట్రీ ఇంకా కోలుకోకుండానే మార్చిలో కూడా మరణవార్తలు మొదలయ్యాయి.
తాజాగా ఓ స్టార్ హీరో లివర్ ఫెయిల్యూర్ తో కన్నుమూయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సినీ పరిశ్రమకు మరో షాక్ తగిలినట్టు అయ్యింది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఒరియా నటుడు పింటు నంద లివర్ ఫెయిల్యూర్ తో కన్నుమూశారు. 45 ఏళ్ళ వయస్సులోనే ఇతను మరణించడం విషాదకరం. కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పింటు నంద .. . మొదట భువనేశ్వర్ లోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు.
కానీ ఆ ట్రీట్మెంట్ సెట్ అవ్వకపోవడంతో.. ఇతన్ని ఢిల్లీకి తరలించారు. అక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని వైద్యులు చెప్పారు. కానీ లివర్ డోనార్స్ దొరకలేదు. దీంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ లివర్ డోనర్ దొరికినప్పటికీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవడం.. అదే టైంలో ఇతని ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో పింటు మరణించినట్టు తెలుస్తుంది.