ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) ప్రస్తుతం హిట్ ట్రాక్ లో పడేందుకు గట్టిగా శ్రమిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రామ్, ప్రస్తుతం P మహేష్ బాబు (Mahesh Babu P) దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. సాగర్ అనే పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ తో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం ఒక సీనియర్ స్టార్‌ను తీసుకోవాలని మేకర్స్ ముందుగానే నిర్ణయించుకున్నారు. తొలుత మోహన్ లాల్ (Mohanlal) పేరును పరిశీలించారని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆ అవకాశం కన్నడ స్టార్ ఉపేంద్ర చేతికి వచ్చిందట.
గతంలో గని (Ghani) సినిమాలో, ఇప్పుడు రజనీ కాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) చిత్రంలో కీలక పాత్రలు చేస్తున్న ఉపేంద్ర (Upendra Rao), తాజాగా రామ్ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించేందుకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది కానీ, ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఉపేంద్ర ఫిక్స్ అయ్యాడనే ప్రచారం ఊపందుకుంది.
ఉపేంద్ర పాత్ర కూడా ఈ సినిమాలో ఓ సినిమా హీరోగా ఉంటుందట. సినిమా కథలో సాగర్ (రామ్) పాత్రతో అతడి పాత్రకు ఎంతో ప్రత్యేకమైన కనెక్షన్ ఉంటుందని సమాచారం. ఓ మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో ఉపేంద్ర క్యారెక్టర్ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అతడి ఎంట్రీతో సినిమా విజువల్‌గా కూడా మరో లెవెల్‌కు వెళుతుందనేది యూనిట్ అభిప్రాయం.