Pooja Hegde: పూజా హెగ్డే ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా అందరు స్టార్ హీరోలకు జోడీగా పూజా హెగ్డే నటించారు. పవన్ హరీష్ శంకర్ కాంబో సినిమాలో సైతం పూజా హెగ్డే హీరోయిన్ కావడం గమనార్హం. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం పూజా హెగ్డే చేతిలో ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు. పూజా హెగ్డే సినిమాల ద్వారా రికార్డు స్థాయిలో సంపాదిస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 2.5 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

సౌత్ ఇండియాలో నయనతార తర్వాత రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ పూజా హెగ్డే కావడం గమనార్హం. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డేకు 51 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ముంబైలో పూజా హెగ్డేకు సొంతంగా 3 పడకల అపార్టుమెంట్ ఉండగా ఈ అపార్టుమెంట్ విలువ కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. యాడ్స్ లో నటించడం ద్వారా పూజా హెగ్డేకు నెలకు 50 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని సమాచారం.

పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ కాగా రాధేశ్యామ్ 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం భవదీయుడు భగత్ సింగ్, బీస్ట్ సినిమాలలో పూజా హెగ్డే నటిస్తున్నారు. పూజా హెగ్డే కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవడంతో పాటు సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే పూజా హెగ్డే పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Share.