మద్యం ప్రకటనపై హీరోయిన్ల మోజెందుకో

హీరోయిన్లు కొన్ని సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా చేస్తుంటారు. ఫలానా వస్తువు కొనండి, ఫలానా సంస్థకు సంబంధించిన వస్తువులు వాడండి అంటూ.. తామేదో ఎప్పుడూ ఆ వస్తువులే వాడుతున్నట్లు, వాడినట్లు చెబుతుంటారు. జనాలు కూడా ఇదేదో బాగుందే అనుకుంటూ వాడేస్తుంటారు. అయితే ఇటీవల కాంలో మన కథానాయికలు ఇస్తున్న యాడ్స్‌ చూస్తుంటే… అంత త్వరగా కొనేద్దాం, వాడేద్దాం అనేలా లేవు. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ యాడ్‌లు ఏంటో.ఒకప్పుడ మద్యానికి సంబంధించిన యాడ్స్‌లు టీవీల్లో ఎక్కువగానే వచ్చేవి.

సినిమాల్లోనూ ఆ తరహా యాడ్‌లు కనిపించేవి. అయితే తర్వాతి రోజుల్లో వీటి వల్ల ఇబ్బంది అవుతుందని యాడ్స్‌ ఆపేశారు. స్పాన్సర్‌షిప్‌లు కూడా నిలిపేశారు. అయితే ఇప్పుడు ఆయా సంస్థలు సోషల్‌ మీడియాను, స్టార్ల క్రేజ్‌ను వాడుకుంటున్నాయి. తాజాగా ఆ ఉచ్చులోకి స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ కూడా వచ్చి చేరింది. భర్త గౌతమ్‌ కిచ్లూతో కలసి కాజల్‌ ఇటీవల ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ పెట్టింది. అందరూ టీచర్స్‌ బ్రాండ్‌ విస్కీ కనిపిస్తోంది. దీపావళిని ఈ బాటిల్‌తో సెలబ్రేట్‌ చేసుకోండి అని కూడా రాసుకొచ్చింది కాజల్‌.

దీంతో ఆమెను నెటిజన్లు బాగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇటీవల రెజీనా కూడా ఇలానే మద్యం బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఆమెకు నెటిజన్ల అక్షింతలు పడ్డాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus