35 ఏళ్లకే కన్నుమూసిన స్టార్ సింగర్.. వైరల్ అవుతున్న వీడియో

ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉండటం అందరినీ ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఇండియన్‌ సింగర్‌ సురేన్‌ ఎమ్‌నమ్‌ మృతి చెందారు.కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన హాస్పిటల్ 35 ఏళ్లకే మరణించారు. మూత్రపిండాల సంబంధిత సమస్యలతో ఆయన మణిపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నాడు ఆయన పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆయన ప్రాణాలు నిలబడలేదు.‘‘ అల్లాహా్‌ కే బంధే’’ అనే పాటను ఆయన పాడుతూ కన్నుమూశారు.

మరో సింగర్‌ అయిన కైలాశ్‌ ఖేర్‌ దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేయగా అది అందరినీ ఎమోషనల్ కు గురిచేస్తుంది. అందరి పెదాలపై చిరునవ్వు ఉండాలని ఆయన ఆకాంక్షిస్తూ అది చివరి కోరిక అన్నట్టు చెప్పుకొచ్చాడు సురేన్. ‘ఈ వీడియో చూసినపుడు చాలా బాధేసింది. సురేన్ బ్రతకాలని చాలా ప్రయత్నించాడు. అతని వ్యాధి నివారణ కోసం మణిపూర్‌ ప్రజలు రూ.58,51,270 విరాళాలు సేకరించి ఇచ్చారు. అయినా అతని ప్రాణాలు నిలబడలేదు.అతని ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

సురేన్ ని బ్రతికించాలని ప్రయత్నించిన మణిపూర్ ప్రజల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి’’ అంటూ కైలాశ్ రాసుకొచ్చాడు.ఇదిలా ఉండగా… సురేన్‌ పేదవాడు కాదు. తనకు ఎంతో ఇష్టం అయిన సింగింగ్‌పై పట్టు సాధించి స్టార్‌ సింగర్‌గా ఎదిగాడు.అయితే, కిడ్నీల వ్యాధి వలన పెద్ద మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే అతని ఆరోగ్యం కోసం ప్రజలను డబ్బులు కోరాడు. అతన్ని బ్రార్థించుకోవాలని మణిపూర్‌ ప్రజలు తక్కువ సమయంలోనే రూ.58,51,270 రూపాయల విరాళాలను సేకరించారు. అయినా సురేన్ ను బ్రతికించుకోలేకపోయారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus