డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్‌ను విచారించగా కొంతమంది పేర్లు బయటికి వచ్చాయని, వారిని విచారించడానికి నోటీసులు పంపమని వార్త టాలీవుడ్ ని కుదిపేసింది. నోటీసులు అందుకున్న వారితో పాటు.. ఈ కేసుకు సంబంధంలేని వారు మీడియా ముందు తమ స్పందన తెలియజేసారు.
ఆ తప్పు చేయలేదు డ్రగ్స్ కేసు విషయంలో పోలీసుల నుండి నోటీసులు అందుకున్న మాట నిజమే. చిన్నతనంలో చేసిన కొన్ని తప్పులకు ఇప్పటికీ నన్ను టార్గెట్ చేస్తున్నారు. గతంలోనేను డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాను. ఆ తప్పులు సరిదిద్దుకున్నాను. డ్రగ్స్ లాంటి పెద్ద తప్పు మాత్రం ఎప్పుడూ చేయలేదు. అసలు కెల్విన్ ఎవరో కూడా తనకు తెలియదు. – నవదీప్
సంయమనం పాటించాలి డ్రగ్స్ ఎవరు తీసుకున్నా మేము ఆ చర్యను ఖండిస్తాం. మేము చట్టాన్ని గౌరవిస్తాం. అయితే, మీడియాలో రూమర్లను మాత్రం ప్రసారం చేయద్దు. ఈ కేసులో అధికారికంగా ప్రకటన వచ్చేవరకు సంయమనం పాటించాలి. – నరేష్
సినిమా వారు ఒక్కరే డ్రగ్సు తీసుకుంటున్నారా? సినిమా వారు చిన్న తప్పు చేసినా కూడా అది మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా చూపిస్తారు. మీడియా మాకు ఎంతగా ఉపయోగపడుతుందో, అంతే ఇబ్బందికరంగా కూడా తయారవుతోంది. సినిమా వారు ఒక్కరే డ్రగ్సు తీసుకుంటున్నారా? – జీవిత
సినీ పరిశ్రమ మొత్తాన్నీ లాగవద్దు డ్రగ్స్ వ్యవహారాన్ని సినీ పరిశ్రమ మొత్తానికి అంటగట్టకూడదు. ఎవరైనా నటులు ఇందుకు పాల్పడితే అది వారి వ్యక్తిగత విషయానికి సంబంధించింది. – శివాజీరాజా
దిగజార్చాలని ప్రయత్నిస్తుంటే… ‘మిమ్మల్ని ఎవరైనా దిగజార్చాలని ప్రయత్నిస్తుంటే… వారి కంటే మీరు ఉన్నత స్థాయిలో ఉన్నట్టే’ – ఛార్మి
ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదు నేను జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదు. కావాలంటే నన్ను పరీక్షించుకోవచ్చు. డ్రగ్స్ వ్యవహారంలో నా పేరు రావడంతో షాక్‌కు గురయ్యాను. ఎక్సైజ్ శాఖ నుంచి నాకు నోటీసులు అందలేదు. – నందు
నాకు డ్రగ్స్ అలవాటు లేదు..డ్రగ్స్ కేసులో నోటీసులు నాక్కూడా అందాయి. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని తెలిపారు . నాకు డ్రగ్స్ అలవాటు లేదు. కెల్విన్ ఎవరో తెలియదు, అతని వద్ద నా నెంబర్ ఎలా ఉందో కూడా అర్థం కావడం లేదు. – సుబ్బరాజు
ఆ వార్తల్లో వాస్తవం లేదుమాదక ద్రవ్యాల కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు నోటీసులు అందినట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇంతవరకు నాకు నోటీసులు రాలేదు. ఒకవేళ వస్తే.. సిట్ వద్దకు వెళ్లి తగిన వివరణ ఇస్తాను. ఈ రకమైన వార్తలు చూసి నా తల్లి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు, దయచేసి వాస్తవాలు చెప్పండి. – తనీష్