సుహాస్ (Suhas) కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రాల్లో ఒకటైన “జనక అయితే గనక” (Janaka Aithe Ganaka) రేపు (సెప్టెంబర్ 7) విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో సినిమాను పోస్ట్ పోన్ చేసి కనీసం తదుపరి విడుదల తేదీని కూడా ప్రకటించలేదు. అ సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో.. సడన్ గా సుహాస్ మరో చిత్రమైన “గొర్రె పురాణం” సెప్టెంబర్ 20 విడుదల అని ఎనౌన్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే “ప్రసన్న వదనం” (Prasanna Vadanam) సినిమా అందించిన సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు సుహాస్.
Suhas
ఇదే ఫ్లోలో “జనక అయితే గనక”తో కూడా హిట్ అయితే మిడ్ రేంజ్ హీరో స్థాయికి ఎదిగిపోయేవాడు సుహాస్ (Suhas) . అయితే.. ఇప్పుడు “జనక అయితే గనక” రిలీజ్ ఎప్పడు అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ సినిమా అవుట్ పుట్ నచ్చి ఏకంగా ఓవర్సీస్ రైట్స్ కూడా కొనుక్కున్నాడు సుహాస్ఒక చిన్న హీరో అయిన సుహాస్ సినిమాలు ఇలా ఒకదానితో మరొకటి పోటీ పడడం అనేది ఓ విధంగా మంచిదనే చెప్పాలి.
ఎందుకంటే మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కూడా ఇలా వరుస విడుదలల కోసం పోటీ పడడం అనేది వారి ఇమేజ్ లకు మంచి వేల్యూ యాడ్ చేస్తుంది. కాకపోతే.. అవి వర్కవుట్ అవ్వకపోతే మాత్రం కెరీర్ ఖతం అయిపోయినట్లే. మరి సుహాస్ ఇలా వరుస విడుదల తేదీల కోసమే కాక మంచి కథల కోసం కూడా పోటీ పడి మంచి కెరీర్ ను బిల్డ్ చేసుకోవాలి.
ఇకపోతే.. సుహాస్ (Suhas) సినిమాను విడుదలకు ఓ 3 రెడీగా ఉండగా, నాలుగు సినిమాలు ప్రొడక్షన్ స్టేజ్ లో, మరో 3 సినిమాలు టాక్స్ లో ఉన్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే మిగతా చిన్న హీరోలు సుహాస్ ను చూసి కుళ్లుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనిపిస్తుంది.