Krishna: మహేష్ కాకుండా ఆ హీరో అంటే ఇష్టమంటున్న కృష్ణ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణ గురించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి ఎన్నో విభిన్న కథ చిత్రాలను పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికి ఉందని చెప్పాలి. ఇక కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు.మహేష్ బాబు సైతం ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక తన వారసుడు మహేష్ బాబు నటించిన సినిమాలను చూస్తూ కృష్ణ ఎంతో మురిసిపోవడమే

కాకుండా సినిమాలపై తన అభిప్రాయాలను కూడా తెలియజేస్తుంటారు. ఇక ప్రస్తుతం ఈయన సినిమాలకు దూరమైనప్పటికీ పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలను అలాగే తన కెరీర్లో ఎదుర్కొన్నటువంటి సంఘటనల గురించి తెలియజేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో కృష్ణ గారికి మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టపడతారు. అయితే మహేష్ బాబు కాకుండా ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో యంగ్ హీరో అంటే ఇష్టం అని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

మరి ఆ యంగ్ హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్.ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టమని ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరో గురించి కృష్ణ చెప్పడంతో ఈ విషయం విన్న ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా కృష్ణ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయనతో ఉన్న అనుబంధం గురించి కూడా వెల్లడించారు.

అయితే ఎన్టీఆర్ తో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని కానీ అల్లూరి సీతారామరాజు సినిమా తరువాత పలు మనస్పర్ధలు వల్ల దాదాపు ఎన్టీఆర్ తో పది సంవత్సరాలు పాటు మాట్లాడలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కృష్ణ తెలిపారు. అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన తర్వాత ఆయన తనతో మాట్లాడి సినిమా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించారని వెల్లడించారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus