టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సర్జెరీ జరుగనుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అనుకున్నట్టుగానే మహేష్ బాబుకి సర్జెరీ జరిగింది.స్పెయిన్‌లో మహేష్ బాబు మోకాలికి ఆపరేషన్ జరిగిందట.అనంతరం మహేష్ బాబు దుబాయ్‌లో విశ్రాంతి తీసుకోవడానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. రెండు నెలల పాటు మహేష్ బాబుకి బెడ్ రెస్ట్ అవసరమట.అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని.. ఇది చిన్నపాటి సర్జెరీ మాత్రమే అని మహేష్ సన్నిహితులు చెబుతున్నారు.
ఇక 2 నెలల అనంతరం ‘సర్కారు వారి పాట’ బ్యాలన్స్ షూటింగ్లో మహేష్ పాల్గొంటాడు. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది.పరశురామ్ బుజ్జి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ వారు.ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఒక ఫైట్, మూడు పాటల చిత్రీకరణ పూర్తిచేయాల్సి ఉందని సమాచారం.నిజానికి 2014 నుండి మహేష్ మోకాలు సమస్యతో బాధపడుతున్నాడు.
2017లో మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించిన ‘స్పైడర్’ టైంకి దాని తీవ్రత పెరిగిందని తెలుస్తుంది.కానీ వెంటనే ట్రీట్మెంట్ తీసుకోలేదు.ఆ చిత్రం షూటింగ్ ఆపితే నిర్మాతకి రూ.7 కోట్లు నష్టం వాటిల్లుతుందని లైట్ తీసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. 2020లో కూడా మహేష్ కాలుకి సర్జెరీ జరిగిందని ప్రచారం జరిగింది.కానీ అందులో నిజం లేదని ఆయన సన్నిహిత వర్గం చెప్పుకొచ్చింది.ఇక ‘సర్కారు వారి పాట’ పనులు పూర్తయ్యాక త్రివిక్రమ్ దర్శకత్వంలో
సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. దాని షూటింగ్ కూడా ఎక్కువ శాతం విదేశాల్లోనే చిత్రీకరించాల్సి ఉందట. ఆ మూవీ కూడా పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ మహేష్ బాబు చేయాల్సి ఉంటుంది.