కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya ), దర్శకుడు విక్రమ్ కుమార్ (Vikram kumar) కలయికలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ అండ్ టైం ట్రావెల్ మూవీ ’24’. ‘మనం’ (Manam) వంటి అల్ట్రా క్లాసిక్ మూవీ తర్వాత దర్శకుడు విక్రమ్ కుమార్ నుండి వచ్చిన సినిమా ఇది. దీంతో రిలీజ్ కు ముందు మంచి హైప్ ఏర్పడింది. అయితే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. కానీ తెలుగులో మాత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. 2016 వ సంవత్సరం మే 6న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
రెహమాన్ (A.R.Rahman) సంగీతంలో రూపొందిన పాటలు విక్రమ్ కుమార్ డైరెక్షన్.. ఆత్రేయగా సూర్య నటన.. తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేటితో ’24’ రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా (24) ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 6.40 cr |
సీడెడ్ | 2.30 cr |
ఉత్తరాంధ్ర | 1.65 cr |
ఈస్ట్ | 1.20 cr |
వెస్ట్ | 0.90 cr |
గుంటూరు | 1.33 cr |
కృష్ణా | 1.10 cr |
నెల్లూరు | 0.52 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 15.40 cr |
’24’ చిత్రం రూ.14.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఏకంగా రూ.15.40 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఫైనల్ గా బయ్యర్స్ కు రూ.0.6 కోట్ల లాభాలు అందించి డీసెంట్ హిట్ అనిపించుకుంది. తర్వాత టీవీల్లో కూడా ఈ సినిమాని ఎగబడి చూశారు.