యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రి పాత్రాభినయం చేస్తున్న జై లవకుశ సినిమా రిలీజ్ కి ముస్తాబవుతోంది. ఓ వైపు బిగ్ బాస్ షో చేస్తూనే.. ఈ సినిమా విడుదలవ్వడంలో ఆలస్యం కాకుండా తారక్ చూసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత కొన్ని రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. డైట్ ఫాలో అవుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. దీని తర్వాత మూవీని కూడా ఫైనల్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో సినిమాకి సైన్ చేశారు. ఈ సినిమాని ఒకే చెప్పడానికి ప్రధాన కారణం కథేనని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.
శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్న ఎన్టీఆర్ కోసం ఫ్యామిలీ కథను వినిపించారంట. కొన్ని రోజులుగా ఫ్యామిలీ సబ్జెక్టు చేయాలనీ ఆశపడుతున్న ఎన్టీఆర్ కి ఈ స్టోరీ భలే నచ్చిందని సమాచారం. దీంతో నిర్మాత ఈ చిత్రం పనులను మొదలెట్టేసారు. ఈ చిత్రానికి “శ్రీనివాస కల్యాణం” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. గతంలో ఎన్టీఆర్, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన బృందావనం మంచి హిట్ అందుకుంది. ఈ సారి ఈ కాంబో సూపర్ హిట్ అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
