Akshara Haasan: బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన అక్షర హాసన్ లవర్.. ఏం చెప్పారంటే?
- September 11, 2024 / 04:50 PM ISTByFilmy Focus
కోలీవుడ్ ఇండస్ట్రీలో అక్షర హాసన్ (Akshara Haasan) కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. గతంలో అక్షర హాసన్ కు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు లీక్ కావడం గురించి సైతం సోషల్ మీడియా వేదికగా తెగ చర్చ జరిగింది. ఆ ఫోటోల వల్లే అక్షర హాసన్ కు తన లవర్ తో బ్రేకప్ జరిగిందని చాలామంది భావించారు. అయితే ప్రముఖ నటుడు, అక్షర హాసన్ లవర్ తనూజ్ వీర్వానీ మాత్రం లీకైన ఫోటోల వల్ల మేము విడిపోలేదని తెలిపారు.
Akshara Haasan

అక్షర హాసన్ (Akshara Haasan) ప్రైవేట్ ఫోటోల గురించి గతంలో స్పందించిన ఈ నటుడు తాజాగా మరోసారి స్పందించారు. బ్రేకప్ తర్వాత కూడా నేను అక్షర హాసన్ తో మాట్లాడుతూనే ఉన్నానని ప్రేమలో ఉన్న వ్యక్తులు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలని తనూజ్ వీర్వానీ పేర్కొన్నారు. ఒకరికోసం ఒకరు అండగా నిలబడాలని వెల్లడించారు. మా ఇద్దరికీ ఆ విషయంలో విబేధాలు వచ్చాయని ఆయన తెలిపారు.

ఆ కారణం వల్లే మేము విడిపోయామని ఆమె ప్రైవేట్ ఫోటోలు లీక్ కావడం వల్ల నేను బ్రేకప్ చెప్పలేదని తనూజ్ వీర్వానీ అన్నారు. ఆ వివాదం తర్వాత మా ఇద్దరికీ దూరం మాత్రం పెరిగిందని ఆ ఫోటోలు నా కారణంగా లీక్ అయ్యాయని ఆమె భావించిందని తనూజ్ పేర్కొన్నారు. అందుకే అవసరం ఉన్న సమయంలో ఆమె నాకు అండగా నిలబడలేదని తనూజ్ వెల్లడించారు.

ఈ విషయంలో నేను ఆమెను నిందించాలని భావించడం లేదని ఎవరి కారణాలు వారికి ఉంటాయని తనూజ్ అన్నారు. గతంలో తనూజ్ మాట్లాడుతూ నేను ఫోటోలను లీక్ చేశానని చాలామంది మాట్లాడుతున్నారని ఎన్నో పత్రికల్లో సైతం రాశారని అక్షర హాసన్ (Akshara Haasan) ఆ వార్తలను ఖండించలేదని తెలిపారు. వ్యక్తిగతంగా నన్ను నమ్మినా నా తప్పు లేదని ఆమె ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదని తనూజ్ తెలిపారు. ఆ ఫోటోల లీక్ గురించి ఎప్పటికైనా వాస్తవాలు వెల్లడవుతాయని నమ్ముతున్నానని ఆయన అన్నారు.
















