సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, హార్ట్ ఎటాక్, కేరింత వంటి చిత్రాల ద్వారా కొంతమందికే పరిచయమైన తేజస్వి.. బిగ్ బాస్ షో ద్వారా ఎక్కువమంది తెలిసివచ్చింది. షో లో ఆమె చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. నోటికి వచ్చినట్లు మాట్లాడడటంతో ఆమె ను షో నుంచి వీక్షకులు బయటికి వచ్చేలా చేశారు. ఇప్పుడు షో నిర్వాహకులు ఎలిమినేట్ అయిన ఆరుమందిలో ఎవరినైనా లోపలి పంపించే అవకాశాన్ని వీక్షకులకు అందించారు. అందుకే తేజస్వి హౌస్ లోపలి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. వివిధ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ.. వేడుకుంటోంది.
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సంచలన కామెంట్స్ చేసింది. తనని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన విధానంపై స్పందించింది. తనపై ట్రోలింగ్ ఆపాల్సిందిగా చాలా రకాలుగా చెప్పానని అయినా వినడంలేదని తేజూ ఓ ఛానల్ లో చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసింది. తనకూ పేరెంట్స్ ఉన్నారని, ఓ మనసుందని, అది బాధపడుతుందని చెప్పుకుంది. “నన్ను బూతులు తిట్టే హక్కు నా స్నేహితులకే లేదు. అలాంటిది ఎవరు పడితే వారు తిడితే నేను భరించను. ఇంట్లో అబ్బాయిలకు తల్లిదండ్రులు అలా కామెంట్ చేయద్దని చెప్పాలి” అని సూచించింది. ఇంకా తేజస్వి మాట్లాడుతూ “మన ఫీలింగ్స్ ను ఎక్స్ ప్రెస్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఉంది. ఎవరి గురించైనా నచ్చితే నచ్చిందని… లేదంటే లేదని చెప్పవచ్చు. కోపాన్ని వ్యక్తం చేయవచ్చు. కానీ బూతులు తిట్టడం ఏమిటి? ” అని ప్రశ్నించింది. మరి ఇక నుంచి అయినా తేజస్విపై ట్రోలింగ్స్ ఆగుతాయేమో చూడాలి.