టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే బాహుబలి సినిమాకు ముందు బాహుబలి (Baahubali) సినిమా తర్వాత అని మాట్లాడుకోవాలి. బాహుబలి1 రిలీజ్ తో టాలీవుడ్ లెక్కలు పూర్తిస్థాయిలో మారిపోయాయి. బాహుబలి2 సినిమా కలెక్షన్ల పరంగా ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా సాధించిన కలెక్షన్ల మార్క్ ను బ్రేక్ చేయడం ఇప్పట్లో మరో సినిమాకు సాధ్యమయ్యే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రభాస్ (Prabhas) గురించి బాహుబలి గురించి కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ప్రభాస్ లేకుండా బాహుబలి మూవీని ఊహించలేమంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. హాలీవుడ్ తో పోటీ పడగలిగి బాహుబలి రాణించిందంటే ప్రభాస్ కారణమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే బాహుబలి సినిమా గురించి రిలీజైన సమయంలో రాజకీయ ప్రముఖుల నుంచి ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ అయితే దక్కలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ లా సంచలనాలు సృష్టించడం ఇప్పట్లో మరో హీరోకు సాధ్యం కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రభాస్ రాజమౌళి (S. S. Rajamouli) కాంబో రిపీట్ అయితే బాహుబలి3 సినిమాను కూడా ప్రేక్షకులు ఆశించొచ్చనే సంగతి తెలిసిందే. ప్రభాస్ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా కన్నప్ప (Kannappa) , ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో విడుదల కానున్నాయి.
రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్న ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. ప్రభాస్ సినిమా సినిమాకు భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటున్నారు.