ఈటీవీలో వచ్చే కామెడీ షోలు, రియాలిటీ షోలు చాలా ఏళ్లుగా ఒకే ఫార్మాట్‌లో, ఒకే రోజుల్లో వస్తుండేవి. అయితే రీసెంట్‌గా ‘జబర్దస్త్’ను మార్పులు చేస్తున్నట్లు ప్రోమోలో ప్రకటించారు. దీంతో ఏమైంది, ఏంటీ మార్పులు, ఎందుకీ చేంజ్ అంటూ చర్చ మొదలైంది. వచ్చే వారం నుండే ఈ మార్పులు అమల్లోకి వస్తున్నాయి అంటున్నారు. అయితే మల్లెమాల – ఈటీవీ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఒకటి కాదు, రెండు మూడు మార్పులు ఉన్నాయి.
మార్పులను రివర్స్ ఆర్డర్‌లో చూస్తే.. శనివారం టెలీకాస్ట్ అవుతున్న ‘సుమ అడ్డా’ షోను మంగళవారానికి షిఫ్ట్ చేశారు. గురువారం, శుక్రవారం ఇప్పుడు రెండు పేర్లతో టెలీకాస్ట్ అవుతున్న ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ను కలిపేసి ఒకే షోగా శుక్ర, శనివారాల్లో టెలీకాస్ట్ చేస్తారు. ఇక బుధవారం మాత్రమే ప్రసారమవుతున్న ‘ఢీ’ కార్యక్రమాన్ని గురువారం కూడా ప్రసారం చేసేలా రెండు పార్టుల్లా ఎక్స్‌టెండ్ చేయబోతున్నారు. ‘ఢీ’లో ప్రస్తుతం ‘సెలబ్రిటీ స్పెషల్’ టైమ్ రన్ అవుతోంది.
ఇప్పటికే ఒక సీజన్ పూర్తవ్వగా ఇప్పుడు రెండో సీజన్ రెడీ చేశారు. దీనికి సంబంధించిన లేడీ జడ్జిని కూడా అనౌన్స్ చేశారు. యాపిల్ బ్యూటీ హన్సిక (Hansika) ఈసారి జడ్జిగా రానున్నారు. ఈ మేరకు ఓ చిన్న ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఇక ‘జబర్దస్త్’కి సంబంధించి పెద్దగా మార్పులేమీ లేవట. రెండు పార్టులుగా ఈ షో ఉంటుంది. అయితే ఇన్ని మార్పులు జరగడానికి కారణం.. ఫార్మాట్ చాలా ఏళ్లుగా ఇలానే ఉండటంతో ఆసక్తి తగ్గుతోందని టీమ్ అనుకోవడమే అంటున్నారు.
అందుకే ఫార్మాట్ మార్చి, పోటీ పెట్టి మరికొన్నేళ్లు ప్రేక్షకుల్ని అలరించాలని టీమ్ భావిస్తోందట. అందుకే ఒక్కో షో రెండేసి రోజులకు మార్చాలని ప్లాన్ చేశారట. మరి ఈ రెండు ముక్కల కాన్సెప్ట్ ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇంద్రజ (Indraja) ఇప్పటికే ‘జబర్దస్త్’ నుండి తాత్కాలికంగా తప్పుకోగా, యాంకర్ సిరి (Siri Hanumanth) కూడా తప్పుకుందని టాక్. కృష్ణ భగవాన్ (Krishna Bhagavaan) , కుష్బూ (Khushbu Sundar) జడ్జిలుగా.. రష్మిక యాంకరింగ్‌తోనే షో రన్ చేస్తారట. ‘ఢీ’ షోకు నందునే (Nandu) యాంకర్‌గా కంటిన్యూ అవుతాడు.