సోషల్ మీడియా కారణంగా స్టార్ వార్స్ అనేవి హద్దులు దాటుతున్నాయ్.. చిరంజీవి – బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు.. ‘మేం మంచి స్నేహితులం.. సినిమాల విషయంలో పోటీ ఉంటేనే మజా.. కాకపోతే ఆ పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి’ అంటుంటారు.. మహేష్ బాబు.. ‘మేమూ మేమూ బాగానే ఉంటాం.. మారాల్సింది మీరే’ అని చెప్పినా ఫ్యాన్స్ మాత్రం మారట్లేదు సరికదా.. సామాజిక మాధ్యమాల ద్వారా మరింత రెచ్చిపోతున్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల అభిమానులు ట్విట్టర్‌లో మాటల యుద్ధాలు, పర్సనల్‌గా తీసుకుని దూషించడం..
ఒకరికొకరు చీరలు, గాజులు పంపించుకోవడం.. ‘‘అసలేమైంది రా బాబూ మీకు?.. ఇంట్లో అమ్మా నాన్నలకు అన్నం పెట్టండి.. హీరోలేమైనా తిండి పెడతారా?’’ అంటూ సలహాలిస్తే.. వాళ్లని కూడా వదలడం లేదు.. ఓ చూపు చూస్తున్నారు.. మన టాలీవుడ్ సంగతి పక్కన పెడితే.. కోలీవుడ్ సంగతే తీసుకుందాం.. అజిత్ – విజయ్ ఫ్యాన్స్ అయితే కొట్టుకు చస్తుంటారు. మొన్న సంక్రాంతికి ‘తునివు’, ‘వరిసు’ విడుదలైతే.. థియేటర్ల కోసం గొడవలు పెట్టుకున్నారు.
థియేటర్ యాజమాన్యం టాస్ వేసి మరీ స్క్రీన్ కేటాయించే పరిస్థితి అంటే వాళ్లది అభిమానం అనాలో.. వెర్రి అనాలో అర్థం కాక తలలు పట్టుకోవాలి.. సరే, వాళ్లూ వాళ్లూ కొట్టుకుంటే పర్లేదు కానీ కర్మ కాలి తెలుగు హీరోలని కెలికారు.. ఇప్పటికే పలుసార్లు విజయ్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య పలుమార్లు వార్ జరిగిన సంగతి తెలిసిందే.. అసలేం జరిగిందంటే.. విజయ్ ఫ్యాన్స్.. ‘‘48+వయసులో విజయ్‌లా ఇలా డ్యాన్స్ చేసే హీరోలున్నారా.. తెలుగులో?’’.. అంటూ అనవసరంగా కెలికారు.
ఇక మనోళ్లకి మండింది.. ఇక బాలయ్య ఫ్యాన్స్.. వజ్రోత్సవాలప్పుడు వేసిన డ్యాన్స్ వీడియోతో పాటు.. 50+లో ‘సింహా’, 60+లోనూ స్టైప్స్ ఇరగదీశాడు అంటూ ‘వీర సింహా రెడ్డి’ లోని సోడా బండి స్టెప్ వీడియోస్ షేర్ చేస్తున్నారు. అంతేకాదు.. సంపూర్ణేష్ బాబు కూడా విజయ్ కంటే బాగా డ్యాన్స్ చేస్తాడంటూ వీడియోలతో కామెంట్స్ చేయడంతో.. మనోళ్ల దెబ్బకి తమిళ తంబీలు.. అదేనండీ విజయ్ ఫ్యాన్స్ నోళ్లు మూసుకున్నారు..