మ్యూజిక్ డైరెక్టర్స్ అందరం కలిసే ఉంటాం.. మీరేం ఫీలవ్వకండి
- December 4, 2019 / 11:50 AM ISTByFilmy Focus
అల వైకుంఠపురములో చిత్రంలోని పాటలన్నీ హిట్ అవ్వడం వలన దేవిశ్రీప్రసాద్ “సరిలేరు నీకెవ్వరు” టైటిల్ విషయంలో చాలా ప్రెజర్ ఫీలవుతున్నాడని, ఈ కారణంగా తమన్-దేవీల నడుమ సఖ్యత తగ్గిందని సోషల్ మీడియాలో మరియు పలు వెబ్ సైట్స్ లో రచ్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి తమన్ ముందుకొచ్చాడు.

తమ మధ్య ఎలాంటి పర్సనల్ గొడవలు ఉండవని ఎవరైనా సాంగ్ కంపోజ్ చేసి అది హిట్టయితే తమదే అన్నట్టుగా ఫీలవుతామని తెలిపాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ మూడు వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయని తమ మధ్య వర్క్ విషయంలోనే కాంపిటిషన్ తప్ప బయట మేం చాలా క్లోజ్ గా ఉంటాం. ఏదైనా సాంగ్ పెద్ద హిట్టైయితే మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య ఎలాంటి విబేధాలు ఉండవని ఎవరూ ఫీలవ్వరనేది తమన్ వాదన. అలా వైకుంఠపురములోని సామజవరగమనా సాంగ్ పెద్ద హిట్ట్. అయితే తమన్..దేవిశ్రీల మధ్య గట్టి పోటీ నడుస్తుందనే వాదనపై పై విధంగా తమన్ స్పందించాడు.
అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!












