‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా గురించి అటు దర్శకుడు శంకర్ (Shankar), ఇటు నిర్మాత దిల్ రాజు (Dil Raju) గొప్పగా మాట్లాడుతూనే ఉన్నారు. సినిమా అద్భుతంగా ఉంటుందని, రామ్‌చరణ్ (Ram Charan) స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోతుందని కూడా చెబుతున్నారు. ఇక సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) అయితే తాను ఇచ్చిన సంగీతం అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అని చెబుతున్నారు. వీటన్నింటికి జాతీయ అవార్డు హైప్ ఒకటి ఎక్స్‌ట్రా. ఇప్పటికే చరణ్‌కి అవార్డు పక్కా అని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) చెప్పగా.. ఆ పేరుకు అంజలిని యాడ్ చేశారు తమన్.
Thaman
సినిమా గురించి తమన్ ఇటీవల ఎక్స్ స్పేషస్‌లో మాట్లాడారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా పాటలను 2021 డిసెంబరులోపే పూర్తి చేశానని షాకింగ్ న్యూస్ చెప్పారు. శంకర్ సర్ సినిమాకి అంత వేగంగా కంపోజింగ్ అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదని, అలా చేసిన పాటలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తపడ్డామని కూడా తమన్ చెప్పారు. ఆ పాటల్ని శంకర్ ఇంకా అద్భుతంగా తెరకెక్కించారు అని వివరించారు.
‘జరగండి జరగండి..’ పాట భలేగా ఉంటుందని, కళ్లజోడు లేకుండానే 3డీలో పాట చూసినట్లు అనిపిస్తుందని చెప్పారు. ఆ స్థాయిలో ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ చేశారు అని శంకర్‌ను పొగిడేశారు తమన్. మొత్తంగా సినిమాలో ఆరు పాటలున్నాయని, జనవరి 4న కొత్తగా రెండు పాటలు విడుదల చేస్తామని చెప్పారు. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అన్నమాట. ఇవి కాకుండా డ్యాన్స్‌కు ప్రాధాన్యమున్న బిట్ సాంగ్ కూడా ఉందని హైప్ ఇచ్చారు తమన్.
ఇక శంకర్ గురించి చెబుతూ.. ఎడిటింగ్ విషయంలో ఆయన ట్రెండ్ సెట్ చేయబోతున్నారని తెలిపారు. సినిమా సెకండాఫ్ చాలా స్పీడ్‌గా ఉంటుందని.. ఇప్పటివరకు అలాంటి స్క్రీన్‌ప్లే చూసి ఉండరు అని కూడా చెప్పారు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదుర్స్ అని చెప్పిన తమన్.. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్, అంజలి (Anjali) పాత్రలకు ప్రశంసలు దక్కుతాయని చెప్పారు. అంతేకాదు అంజలికి జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నా అని కూడా చెప్పారు తమన్.