స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ప్రస్తుతం థమన్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది రిలీజైన పెద్ద హీరోల, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలలో ఎక్కువ సినిమాలకు థమన్ మ్యూజిక్ అందించారు. చిన్న వయస్సులోనే సంగీత వాయిద్యాలను చేతపట్టిన థమన్ తన ప్రతిభతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తాతయ్య ఘంటసాల బలరామయ్య నటుడు, నిర్మాత అని థమన్ వెల్లడించారు.
తాతయ్య ఏఎన్నార్ తో కలిసి చాలా సినిమాలు చేశారని థమన్ చెప్పుకొచ్చారు. నాన్నకు సంగీతంపై ఆసక్తి ఉండేదని దాదాపు 1,000 సినిమాలకు డ్రమ్స్ వాయించారని థమన్ అన్నారు. చిన్నప్పటి నుంచి చుట్టూ సంగీతం ఉండటంతో ప్రస్తుతం తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నామని థమన్ వెల్లడించారు. మా నాన్న మరణించి 27 సంవత్సరాలు అయిందని థమన్ అన్నారు. చెల్లి ఐటీలో జాబ్ చేస్తుందని సంగీతంపై ఆసక్తితో తను కూడా సింగర్ గా మారిపోయిందని థమన్ చెప్పుకొచ్చారు.
భార్య శ్రీవర్ధిని కూడా సింగర్ అని తన మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఐదు పాటలను భార్య పాడిందని థమన్ వెల్లడించారు. అఖండ సినిమా చూసిన తర్వాత బాలయ్య తనతో నువ్వు కూడా ఒక హీరోవే అని అన్నారని థమన్ చెప్పుకొచ్చారు. తమ మ్యారేజ్ పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ అని థమన్ పేర్కొన్నారు. నాకోసం భార్య శ్రీవర్ధిని చాలా త్యాగం చేసిందని థమన్ చెప్పుకొచ్చారు. తాను భార్యకు ఎక్కువ సమయం కేటాయించడం కుదరలేదని థమన్ వెల్లడించారు.
నా కొడుకుకు సంగీతం అంటే ఇష్టమని అయితే నా ముందు పాటలు పాడాలంటే సిగ్గు అని థమన్ పేర్కొన్నారు. ఇంట్లో తన భార్యకే ఎక్కువ ప్రతిభ ఉందని థమన్ కామెంట్లు చేశారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చే ఏడాది భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. థమన్ ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.