‘రాధే శ్యామ్’ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించినప్పటికీ నేపధ్య సంగీతం కోసం ప్రస్తుతం భీభత్సమైన ఫామ్లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ ను ఎంపిక చేసుకున్నారు. ‘క్రాక్’ ‘వకీల్ సాబ్’ ‘అఖండ’ ‘భీమ్లా నాయక్’ కు అతను అద్భుతమైన నేపధ్య సంగీతం అందించాడు. ‘వకీల్ సాబ్’ తీసేస్తే మిగిలిన మూడు మాస్ సినిమాలు కావడంతో తమన్ చెలరేగిపోయాడు. అయితే ‘రాధే శ్యామ్’ అనేది ఓ లవ్ స్టోరీ. ఇందులో హీరో ఎలివేషన్స్ ఎక్కువగా ఉండవు.
మరి ఇలాంటి సినిమాకి తమన్ నేపధ్య సంగీతం ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.అలాంటి డౌట్స్ కు తమన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అతను మాట్లాడుతూ… “ఇలాంటి బిగ్ బడ్జెట్ ప్రేమ కథా చిత్రం మునుపెన్నడూ రాలేదు.ఈ మూవీకి మ్యూజిక్ బాగా డిమాండ్ చేసింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు బాగా స్కోప్ ఉంది. 30 రోజుల నుండీ ఈ మూవీ కోసం పనిచేయడం ప్రారంభించాను.
యూరప్ లో భారతీయ కచేరీ పెడితే ఎలా ఉంటుందో రాధేశ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలా ఉండబోతుంది. ప్రభాస్-పూజాహెగ్డే ప్రేమను, వాళ్ల కెమిస్ట్రీని చూస్తే ఆటోమేటిక్ గా మ్యూజిక్ వాయించేయాలనిపించింది. వాళ్లిద్దరి కెమిస్ట్రీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఒక వయొలిన్ తో సరిపెట్టేసే మూవీ కాదు ఇది. వంద వయొలిన్స్ వాడాం. దాదాపు 600 మంది మ్యూజీషియన్లు పనిచేశారు. థియేటర్స్ లో మీరు చూస్తారు.చాన్నాళ్ల ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుర్తుండిపోతుంది.
నా మనసుకి నచ్చిన సినిమాకి పనిచేసినందుకు ఆనందంగా ఉంది.లవ్ స్టోరీ కదా అని ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్మూత్ గా ఉండదు. ప్రభాస్ కటౌట్ కు తగ్గ మ్యూజిక్కే ఉంటుంది. అంత పెద్ద కటౌట్ ప్రేమలో ఎన్ని జరగాలో దర్శకుడు ఈ చిత్రం కోసం అన్నీ చేసాడు” అంటూ తమన్ చెప్పుకొచ్చాడు.