సంబరాలు, పండగలు, పెళ్లిళ్లు, తిరునాళ్లు, డీజేలు, బోనాలు… ఇలా ఏ శుభ సందర్భం, ఆనందదాయక కార్యక్రమం జరిగితే పాటలు మోత మోగిపోతుంటాయి. అభిమాన హీరోల మాస్ పాటలను రిపీట్‌లో వేసి డ్యాన్స్‌లు వేసి మురిసిపోతుంటారు. ఇటీవల కాలంలో ఒరిజినల్ సాంగ్‌కి డీజే వెర్షన్‌లు కూడా రూపొందిస్తున్నారు. పాట రావడం ఆలస్యం… దానికి డీజే జోడించి ఔత్సాహికులు రిలీజ్ చేస్తున్నారు. అయితే వారికి ఎందుకు శ్రమ… మేమే ఇస్తామంటూ కొన్ని చిత్రబృందాలు డీజే వెర్షన్‌ను కూడా రిలీజ్ చేస్తున్నారు.
అలా తాజాగా ‘భీమ్లా నాయక్’ నుండి డీజే వెర్షన్ వచ్చింది. కొత్త సంవత్సర కానుకగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోసం తమన్ అండ్ టీమ్ ఎంతో ‘కష్టపడి’… ‘లాలా భీమ్లా..’ పాటకు డీజే వెర్షన్ రూపొందింది. ఆ పాట రిలీజ్ అయ్యింది కూడా. అయితే ఆ కష్టం బూడిదలో పోసిన పని అయ్యిందంటున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్. కారణం ‘లాలా భీమ్లా… ’ డీజే వెర్షన్ ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడమే.
ఎప్పుడో వాడేసిన బీట్, ట్యూన్‌ను ఈ పాటకు అతికించి రిలీజ్ చేసినట్లు ఉంది అని సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. ఇంకొందరు అయితే ఈ పాట కంటే తొలి వెర్షనే బాగుంది అని కూడా అంటున్నారు. ఈ పాటను బయట డీజే మిక్సింగ్ చేసేవాళ్ల చేతిలో పెట్టి ఉంటే ఇంకా బాగా డీజే చేసేవారు అని అనిపిస్తోంది. నిజానికి ‘లాలా భీమ్లా..’ పాట తొలిసారి విన్నప్పుడు చాలామందికి నచ్చలేదు. ఇదేంటి మాస్ పాటలా లేదు, ఏదో స్లోగా ఉంది అని అనుకున్నారు. ఆ తర్వాత వినగ వినగా ఓకే… బాగానే ఉందిలే అనుకున్నారు.
ఇంకేముంది డీజే వెర్షన్ కూడా ఇలానే నచ్చుతుందిలే అంటారా.. అయితే అంత అవకాశం లేదు అనేది మరో మాట. పాటలో అంత ఊపు లేదు అని టాక్. సినిమా విడుదల తేదీ ఆలస్యమవ్వడంతో… ఈ పాటలో మరోసారి పవన్‌ను చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. ‘అఖండ’ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో అందరి నోట వినిపించిన తమన్… ‘లాలా భీమ్లా..’ డీజేతో మళ్లీ ‘ఇదేంటి తమనో ఇలా చేశావ్’ అనిపించుకుంటున్నాడు. అయితే తమన్ ఎలాగూ ఈ ట్రోలింగ్స్ పట్టించుకోడు. మరి ఇంట్లో వాళ్లు ఏమన్నారో మరి.